తెలంగాణ

telangana

ETV Bharat / state

మేలైన పౌల్ట్రీ విధానం: శ్రీనివాస్​ యాదవ్​

కల్తీ లేని ఉత్పత్తులు అందించే పౌల్ట్రీ విధానం తీసుకువస్తామని పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అన్నారు. హైదరాబాద్​లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పౌల్ట్రీ రంగం అభివృద్ధిపై జరిగిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశానికి మంత్రి  అధ్యక్షత వహించారు.

cabinate sub committee  met at Hyderabad on poultry
మేలైన పౌల్ట్రీ విధానం: శ్రీనివాస్​ యాదవ్​

By

Published : Dec 13, 2019, 7:04 PM IST

హైదరాబాద్​ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అధ్యక్షతన పౌల్ట్రీ రంగం అభివృద్ధిపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. కల్తీ లేని ఉత్పత్తులు అందించే పౌల్ట్రీ విధానం తీసుకువస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ పౌల్ట్రీ రంగం బలోపేతంపై తీసుకోవాల్సిన చర్యలు, దాణా ఉత్పత్తి కోసం రైతులకు ప్రోత్సాహం వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

రాయితీలు

విద్యుత్, దాణా రాయితీలు వంటి ప్రభుత్వ సానుకూల నిర్ణయాలు ప్రస్తావనకు వచ్చాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, ఈటల రాజేందర్‌, శ్రీనివాసగౌడ్​తో పాటు పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, సంచాలకులు డాక్టర్ లక్ష్మారెడ్డి, పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధి చక్రధర్‌ పాల్గొన్నారు.

మేలైన పౌల్ట్రీ విధానం: శ్రీనివాస్​ యాదవ్​

ఇవీచూడండి: 'దిశ' ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్‌ విచారణ...

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details