రాష్ట్రంలో క్యాబ్ డ్రైవర్లు తమ సమ్మె విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. క్యాబ్ డ్రైవర్ల ఐకాస నాయకులు రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి తమ సమస్యలు, డిమాండ్లు వివరించారు. అనంతరం ఈ నెల 19 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన తమ సమ్మెను విరమించుకుంటున్నట్లు వారు తెలిపారు. సమ్మెకు దారితీసిన పరిణామాలు గవర్నర్‌కు వివరించామన్నారు. డిమాండ్ల పరిష్కారం దిశగా చర్యలు తీసుకోకుంటే త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని క్యాబ్ డ్రైవర్ల ఐకాస ఛైర్మన్ సలావుద్దీన్ పేర్కొన్నారు.
సమ్మె విరమించిన క్యాబ్ డ్రైవర్ల ఐకాస - రాజ్‌భవన్
ఈ నెల 19 అర్ధరాత్రి నుంచి తలపెట్టిన క్యాబ్ డ్రైవర్ల సమ్మెను విరమించుకుంటున్నట్లు ఐకాస నాయకులు ప్రకటించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్ తమిళిసైను కలిసి తమ సమస్యలను వివరించినట్లు వారు పేర్కొన్నారు.
సమ్మె విరమించిన క్యాబ్ డ్రైవర్ల ఐకాస