తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆధునిక హంగులతో బల్కంపేట వైకుంఠధామం

ఆధునిక హంగులతో నిర్మాణం జరుపుకొంటున్న బల్కంపేట వైకుంఠధామం పనులు పూర్తి కావచ్చాయి. గతంలో పనులు కొంత జాప్యమైనా.. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ చొరవతో ఎట్టకేలకు చివరి దశకు చేరాయి. ఈ శ్మశానవాటిక లోపల గతంలో ఎంత అధ్వాన్నంగా ఉండేదో ఇప్పుడు అంత సుందరంగా మారింది.

Bulkampeta cemetery work may have been completed in hyderabad
ఆధునిక హంగులతో బల్కంపేట వైకుంఠధామం

By

Published : Nov 5, 2020, 9:41 AM IST

ముచ్చటైన నిర్మాణం , రకరకాల మొక్కలతో వెదజల్లుతున్న పచ్చదనం.. వెరసి బల్కంపేటలో ఆధునిక హంగులతో నిర్మాణం జరుపుకొంటున్న వైకుంఠధామం పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఒకప్పుడు పిచ్చి మొక్కలు, చెత్తతో నిండిపోయి అధ్వాన్నంగా ఉండే ఈ శ్మశానవాటికను దాదాపు రూ.కోట్లతో ఆధునికీకరించారు. మూడేళ్ల క్రితం ప్రారంభమైన ఈ పనులు కొంత జాప్యమైనా.. మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​ చొరవతో ఎట్టకేలకు చివరి దశకు చేరాయి.

ఆధునిక హంగులతో శ్మశానవాటికను సుందరంగా తీర్చిదిద్దారు. లోపల రకరకాల మొక్కలు, చెట్లతో పచ్చదనం వెదజల్లుతోంది. మరుగుదొడ్లు స్నానాలగదులు వంటివి ఆధునికంగా నిర్మించారు. అప్పట్లో ఈ శ్మశానవాటికను శంఖు ఆకారంలో నిర్మించాలని జీహెచ్​ఎంసీ అధికారులు నిర్ణయించారు. ప్రస్తుతం వైకుంఠధామం బయట పనులు చురుగ్గా సాగుతున్నాయి. ప్రహరీకి వేసిన డిజైన్​ ప్రధాన రహదారిలో వెళ్లే వాహనాదారులను ప్రత్యేకంగా ఆకర్షిస్తుంది.

మంత్రి తలసాని ప్రత్యేక శ్రద్ధ

దాదాపు రెండు ఎకరాల పైచిలుకు విస్తీర్ణం ఉండే ఈ శ్మశానవాటికను అభివృద్ధి చేయాలని మూడేళ్ల క్రితం మంత్రి తలసాని నిర్ణయించారు. అప్పట్లో మంత్రి కేటీఆర్​ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించారు. మొదట పనులు కొంత వేగంగా జరిగినా తరువాత నెమ్మదించి, క్రమంగా ఆగిపోయాయి. జీహెచ్​ఎంసీ నిధులు ఇవ్వకపోవడం వల్ల గుత్తేదారు నిర్మాణ పనులు నిలిపివేశారు. మంత్రి తలసాని ప్రత్యేక శ్రద్ధ చూపించి... జీహెచ్​ఎంసీ ఉన్నతాధికారులతో మాట్లాడి చర్యలు తీసుకున్నారు. మూడు పర్యాయాలు మంత్రి కేటీఆర్​ను ఇక్కడకు తీసుకొచ్చి అభివృద్ధి పనులను చూపించడం వల్ల కావాల్సిన నిధులు మంజూరయ్యాయి. పనులను ఎప్పటికప్పుడు మంత్రి తలసాని స్వయంగా పర్యవేక్షించి త్వరగా పూర్తయ్యేలా చూశారు. త్వరలో వైకుంఠధామం ప్రారంభానికి సిద్ధం అవుతుందని సనత్​నగర్​ కార్పొరేటర్​ కొలను లక్ష్మి తెలిపారు.

ఇవీ చూడండి: మరో రెండు పారిశ్రామిక పార్కులు... తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details