తెలంగాణ

telangana

ETV Bharat / state

Budwel layout auction Hyderabad : హాట్ కేకుల్లా భూముల అమ్మకం..సర్కారు ఖజానాకు కనకవర్షం.. బుద్వేల్​ లే ఔట్​పే స్పెషల్ ఫోకస్ - Rangareddy District News

Budwel layout auction Hyderabad : హైదరాబాద్ శివారులో సర్కారు భూములు హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. కనీవినీ ఎరుగని రీతిలో కోట్లు పలుకుతూ సర్కారు ఖజానా నింపుతున్నాయి. ఎకరం ధర 100 కోట్ల పైచిలుకు పలికిందంటే రాష్ట్ర రాజధానిలో.. భూముల విలువ ఏ స్థాయికి పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు బుద్వేల్ లే అవుట్​పై ప్రభుత్వం దృష్టి సారించింది. 182 ఎకరాల ప్రభుత్వ భూమిలో.. 100 ఎకరాలను హెచ్​ఎండీఏ ఈ-వేలం పాట ద్వారా విక్రయించబోతుంది.

Budwel layout auction Hyderabad
Budwel layout auction

By

Published : Aug 5, 2023, 9:22 AM IST

Updated : Aug 5, 2023, 12:27 PM IST

Budwel layout auction Hyderabad : హాట్ కేకుల్లా భూముల అమ్మకం..సర్కారు ఖజానాకు కనకవర్షం.. బుద్వేల్​ లే ఔట్​పే స్పెషల్ ఫోకస్

Budwel layout auction Hyderabad :రాష్ట్ర ప్రభుత్వానికి సర్కారు భూములు కనక వర్షాన్ని కురిపిస్తున్నాయి. హైదరాబాద్ శివారులోని వందల ఎకరాలను హెచ్​ఎండీఏ అమ్మకానికి సిద్ధం చేస్తోంది. బడా వ్యాపార సంస్థలు ఆ భూములను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ క్రమంలో మొన్న కోకాపేటలోని నియోపోలీస్ లేఅవుట్​లోని రెండో దశ విక్రయించిన మొత్తం.. 45.33 ఎకరాలకు 3 వేల 319 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది.

HMDA Notification for Budwel layout auction :తాజాగా బుద్వేల్ లేఅవుట్​పై కూడా రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం బుద్వేల్ లో బహుళ ప్రయోజన నిర్మాణాలకు అనుగుణంగా.. మౌలిక వసతులతో అభివృద్ధి చేసిన 182 ఎకరాల స్థలంలో మొదటి విడతగా 100 ఎకరాలను హెచ్​ఎండీఏ ద్వారా విక్రయించనున్నారు.

High Court on Pharmacity Land : ఫార్మాసిటీ భూసేకరణపై హైకోర్టు కీలక తీర్పు.. మేడిపల్లిలో భూసేకరణ నోటిఫికేషన్లు రద్దు

ఎక్కువ విస్తీర్ణం కలిగిన పెద్ద సైజులో ఉన్న మొత్తం 14 ప్లాట్లను అమ్మకానికి ఉంచారు. ఒక్కో ప్లాట్లలో 3.47 ఎకరాల విస్తీర్ణం నుంచి 14.33 ఎకరాల విస్తీర్ణం వరకు ఉన్నాయి. బుద్వేల్ భూముల అమ్మకానికి జారీ చేసిన నోటిఫికేషన్ ఆరో తేదీన ప్రీ బిడ్ సమావేశం నిర్వహిస్తారు. 8న సాయంత్రం ఐదు గంటల వరకు రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించారు. భూముల అమ్మకం కోసం ఆగస్టు 10న ఈ వేలం నిర్వహిస్తారు.

Hyderabad real estate development : బుద్వేల్ భూములకు ఎకరాకు ప్రభుత్వం 20 కోట్ల రూపాయల కనీస ధరను నిర్ణయించింది. కోకాపేటలో నియోపోలీస్ లేఔట్​లో విక్రయాల దృష్ట్యా ఆ ధర మూడింతలు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఎకరా సుమారు 60 కోట్ల వరకు వెళ్లవచ్చని బడా వ్యాపార సంస్థలు, బిల్డర్లు, నిర్మాణ రంగ నిపుణులు భావిస్తున్నారు.

ఇందుకు బుద్వేల్ లేఔట్.. ఔటర్ రింగు రోడ్డుకు ఆనుకొని ఉండటం, శంషాబాద్ విమానాశ్రయానికి అత్యంత సమీపంలో ఉండటం కూడా కొనుగోలుదారులు పెద్ద ఎత్తున పోటీ పడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ-వేలంపాటకు సమయం ఆసన్నం అవడంతో బుద్వేల్ లేఔట్‌లో హెచ్​ఎండీఏ పనులను ముమ్మరంగా కొనసాగిస్తోంది. కొండలు, గుట్టలతో ఉన్న ప్రాంతాన్ని చదును చేయిస్తున్నారు.

Govt land auction in Hyderabad :రహదారుల నిర్మాణంతోపాటు.. వీధి దీపాల ఏర్పాటు కొనసాగుతోంది. అయితే బుద్వేల్ లేఅవుట్​ పూర్తిగా నిర్మాణాలకు అనువుగా తీర్చిదిద్దడానికి మరో 18 నెలలు పట్టవచ్చని అంచనా. ఆ దిశగా కాంట్రాక్టర్లతో పరిసరాలను ముస్తాబు చేయిస్తున్నారు. బుద్వేల్‌లోని భూములు విక్రయానికి సిద్ధం కావడంతో.. నగరంతోపాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో బడా వ్యాపారులు, స్థిరాస్తి సంస్థల ప్రతినిధులు ఇటువైపు క్యూ కట్టారు.

అలాగే ప్రభుత్వ భూముల విక్రయాలపై రాజకీయంగానూ, ప్రజా సంఘాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ దశలో ప్రభుత్వం భూముల విక్రయాలను ఆర్థిక కోణంలో కాకుండా అభివృద్ధి కోణంలో చూడాలని కోరుతోంది. వేలంపాట ద్వారా వచ్చే నిధులను ప్రజల మౌళిక సదుపాయాల కల్పన కోసం వెచ్చించాలని.. కొంత మంది కొనుగోలుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బుద్వేల్ భూముల్లో ఎకరా సగటున 30 కోట్ల ధరకు అమ్ముడుపోయినా కనీసం 3 వేల కోట్ల రూపాయల ఆదాయం వస్తుందన్నది రాష్ట్ర ప్రభుత్వ అంచనా వేస్తుంది. ఈ భూముల వేలం తర్వాత శంకరపల్లి సమీపంలోని మోకిల వద్ద ఉన్న 165 ఎకరాల ప్రభుత్వ భూములను కూడా విక్రయించాలనే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Hyderabad Metro expantion : ఓఆర్‌ఆర్‌ చుట్టూ మెట్రో విస్తరణ.. కొత్త కారిడార్లు ఇవే: ఎన్వీఎస్‌ రెడ్డి

Last Updated : Aug 5, 2023, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details