అభివృద్ధిలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది: రాష్ట్ర మంత్రులు BRS Spiritual Gatherings Across the Telangana State: ప్రభుత్వ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్లడం, తొమ్మిదేళ్లలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని క్షేత్రస్థాయిలో వివరించేందుకు బీఆర్ఎస్ చేపట్టిన ఆత్మీయ సమ్మేళనాలు.. ఉత్సాహంగా సాగుతున్నాయి. నిజామాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గణేశ్ గుప్తా బీఆర్ఎస్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించారు. ఆటో క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో కుటుంబ సమేతంగా జరిగిన ఆటో కార్మికుల ఆత్మీయ సమ్మేళనానికి హరీశ్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆటో నడిపారు. అంతకుముందు రాఘవాపూర్‌లో నిర్వహించిన కార్యక్రమానికి హాజరైన మంత్రి.. రాష్ట్రం సహకరించలేదంటూ ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి మండిపడ్డారు.
ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఈ నెల 12న నిర్వహించనున్న మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన ఆహ్వాన కరపత్రాలను ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఇంటింటికీ పంపిణీ చేశారు. ఖమ్మంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్, ఎంపీ నామ నాగేశ్వరరావు పాల్గొన్నారు. 2018 ఎన్నికల్లో తనను వెన్నుపోటు పొడవాలని చూసినప్పటికీ.. కార్యకర్తల బలంతో గెలిచానని పువ్వాడ తెలిపారు. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో చెప్పినవన్నీ అసత్యాలేనని నామ నాగేశ్వరరావు విమర్శించారు.
సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి: హైదరాబాద్ అజాంపురాలో జరిగిన సమావేశానికి హోంమంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఓ వైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమ పథకాలు అందించే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని హోంమంత్రి స్పష్టం చేశారు. దేశ రాజకీయాలను ప్రశ్నించే దమ్ము ఉన్న నాయకుడు కేసీఆర్ అని రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో జరిగిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు మంత్రి సూచించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఆత్మీయ సమ్మేళనాల్లో పార్టీ శ్రేణులను కార్యోన్ముఖులను చేస్తున్న నేతలు.. ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పిస్తున్నారు.
రాష్ట్రానికి నరేంద్ర మోదీ వచ్చి ఏం మాట్లాడారు. ఎంత సేపు మన మీద బురద జల్లే పనే వారికి. రాష్ట్రం, కేంద్రానికి సహాకరించట్లేదంటా.. దొంగే దొంగ అన్నట్లుగా ఉంది ఇది. అసలు ఎవరు ఎవరికి సహకరించలేదు. మా రాష్ట్ర విభజన చట్టంలో బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పెట్టమంటే.. ఎగబెట్టింది నువ్వు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ వరంగల్‌లో పెట్టలాంటే ఎగబెట్టింది నువ్వు కాదా..? ఈ రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ కూడా ఇవ్వంది నువ్వు. ఈ రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్ట్ ఇవ్వనిది నువ్వు. ఈ రాష్ట్రానికి సహకరించకుండా.. రాష్ట్రాన్ని ఇబ్బంది పెడుతుంది ఈ ప్రధాని నరేంద్ర మోదీ. -తన్నీరు హరీశ్‌రావు, మంత్రి
ఇవీ చదవండి: