తెలంగాణ

telangana

ETV Bharat / state

Live Updates: మహారాష్ట్రలోని ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి: సీఎం కేసీఆర్​ - BRS public meeting in Maharashtra latest news

kcr
kcr

By

Published : Mar 26, 2023, 2:56 PM IST

Updated : Mar 26, 2023, 4:12 PM IST

16:10 March 26

మేం నాందేడ్‌లో సభ పెట్టగానే రైతుల ఖాతాల్లో రూ.6 వేలు వేశారు

  • బీఆర్​ఎస్​ సభ సత్తా ఏంటో మీకు అర్థమైంది కదా..
  • బీఆర్​ఎస్​ పార్టీని మహారాష్ట్రలోనూ రిజిస్టర్‌ చేయించాం
  • రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తాం
  • ప్రతి జిల్లా పరిషత్‌పై గులాబీ జెండా ఎగరాలి
  • ఫసల్‌ బీమా యోజన డబ్బు మీలో ఎవరికైనా అందిందా?
  • బీఆర్​ఎస్​ను గెలిపించండి.. రైతుల సమస్యలను పరిష్కరిస్తాం
  • మహారాష్ట్రలోని అనేక ప్రాంతాల నుంచి మాకు విజ్ఞప్తులు వస్తున్నాయి
  • మా ప్రాంతంలో సభ పెట్టాలని అనేకచోట్ల నుంచి విజ్ఞప్తులు వస్తున్నాయి

16:04 March 26

జీవితాంతం రైతులు పోరాడాల్సిందేనా..?

  • ఉల్లి, చెరుకు ధరలు కోసం ఏటా పోరాడాల్సిందేనా..?
  • ఇక్కడి ఎంపీ, ఎమ్మెల్యేలు ఏంచేస్తున్నారు..?
  • జీవితాంతం రైతులు పోరాడాల్సిందేనా..?
  • ఇది రాజకీయం సభ కాదు, బతుకుల పై ఆలోచన సభ
  • యూపీ, పంజాబ్‌లో నేతల మాయమాటలకు మోసపోయాం
  • రైతులు మోసపోకూడదనే అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ అనే నినాదం ఇస్తున్నా
  • ధర్మం, మతం పేరిట విడిపోతే రైతుల ఆత్మహత్యలు ఆగవు

15:54 March 26

నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు

  • కాంగ్రెస్‌ 54 ఏళ్లు, భాజపా 14 ఏళ్ల పాలించి ఏం చేశాయి..?
  • అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది
  • ఏటా 50 వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది
  • మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నదులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరగట్లేదు
  • నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు
  • దేశంలో సమృద్ధిగా సహజ వనరులు ఉన్నాయి
  • దేశంలో 360 బిలియన్‌ టన్నుల బొగ్గు ఉంది
  • దేశంలో ఉన్న బొగ్గుతో 24గంటల విద్యుత్‌ సులభంగా ఇవ్వొచ్చు
  • పీఎం కిసాన్‌ కింద కేంద్రం కేవలం రూ.6 వేలు మాత్రమే ఇస్తోంది
  • పీఎం కిసాన్‌ కింద రైతులకు కనీసం రూ.10 వేలు ఇవ్వాలి

15:50 March 26

తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకూ నేను వస్తూనే ఉంటా

  • మహారాష్ట్రలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు
  • తెలంగాణలో దళితబంధు అమలు చేస్తున్నాం..
  • మహారాష్ట్రలోనూ దళిత బంధు అమలు చేస్తే నేను రానని ప్రకటిస్తున్నా
  • అంబేడ్కర్‌ పుట్టిన మహారాష్ట్రలో దళిత బంధు అమలు చేయాలని డిమాండ్‌ చేస్తున్నా
  • తెలంగాణ సీఎంకు ఇక్కడ ఏంపని అని దేవేంద్ర ఫడణవీస్ నన్నడిగారు?
  • తెలంగాణలో మేం ఇస్తున్నట్లు మహారాష్ట్ర రైతులకూ ఇవ్వాలని కోరా
  • తెలంగాణలో ఇచ్చినట్లు ప్రతి ఎకరానికి ఏటా రూ.10 వేలు ఇవ్వాలి
  • తెలంగాణలో ఇచ్చినట్లు రైతులకు 24 గంటల విద్యుత్ ఇవ్వాలి
  • తెలంగాణలో దళితబంధు కింద కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తున్నాం
  • మహారాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కరించండి.. మరోసారి నేను రాను..
  • కాంగ్రెస్, బీజేపీలతో మన బతుకులు మారాయా..?
  • అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది

15:42 March 26

తెలంగాణలో రైతు బీమా ఇస్తున్నాం.. పూర్తిగా పంట కొంటున్నాం: కేసీఆర్​

  • కేసీఆర్‌కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడణవీస్‌ అంటున్నారు: కేసీఆర్​
  • తెలంగాణలో రైతు బంధు, 24 గంటల కరంట్‌ అందిస్తున్నాం: కేసీఆర్​
  • తెలంగాణలో రైతు బీమా ఇస్తున్నాం.. పూర్తిగా పంట కొంటున్నాం: కేసీఆర్​
  • తెలంగాణ తరహా అభివృద్ధి ఫడణవీస్‌ చేస్తే నేను మహారాష్ట్ర రానని ప్రకటిస్తున్నా: కేసీఆర్​

15:38 March 26

దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోంది.. దాన్నెవరూ ఆపలేరు: కేసీఆర్​

  • ఛత్రపతి శివాజీకి జన్మనిచ్చిన మరాఠా నేలకు ప్రణామం: కేసీఆర్​
  • పార్టీలో చేరుతున్న నేతలకు హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతున్నా: కేసీఆర్​
  • లోహ సభకు తరలివచ్చిన ప్రజలు, రైతులకు ధన్యవాదాలు: కేసీఆర్​
  • నాందేడ్‌ వాసుల ప్రేమ కారణంగానే ఇక్కడే రెండో సభ నిర్వహిస్తున్నాం: కేసీఆర్​
  • దేశంలో త్వరలో రైతుల తుపాన్‌ రాబోతోంది.. దాన్నెవరూ ఆపలేరు: కేసీఆర్​

15:22 March 26

కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ చేరిన పలువురు మరాఠా నేతలు

  • మహారాష్ట్ర: లోహ బహిరంగసభకు హాజరైన సీఎం కేసీఆర్‌
  • మహారాష్ట్ర: నాందేడ్ జిల్లా లోహలో బీఆర్ఎస్ బహిరంగసభ
  • శివాజీ, అంబేడ్కర్‌, పూలే విగ్రహాలకు పూలమాలలు వేసిన కేసీఆర్‌
  • కేసీఆర్‌ సమక్షంలో బీఆర్ఎస్ చేరిన పలువురు మరాఠా నేతలు
  • బీఆర్ఎస్ చేరిన ఎన్సీపీ మాజీ ఎమ్మెల్యే శంకర్‌రావు దోండే
  • గులాబీ కండువాలు కప్పి నేతలను పార్టీలోకి ఆహ్వానించిన కేసీఆర్‌
  • మహారాష్ట్ర: సందడిగా బీఆర్ఎస్ లోహ సభాప్రాంగణం
  • మహారాష్ట్ర: లోహ సభకు తరలివచ్చిన కార్యకర్తలు, ప్రజలు
  • అబ్‌ కీ బార్‌ కిసాన్‌ సర్కార్‌ నినాదంతో లోహ బీఆర్ఎస్ సభ
  • మహారాష్ట్రలో రెండో బహిరంగ సభ నిర్వహిస్తున్న బీఆర్ఎస్
  • గతంలో నాందేడ్‌లో బహిరంగ సభ నిర్వహించిన బీఆర్ఎస్

14:40 March 26

Live Updates నాందేడ్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌

  • మహారాష్ట్ర నాందేడ్ చేరుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌
  • నాందేడ్‌లోని శ్రీగురుగోవింద్‌సింగ్ విమానాశ్రయం చేరుకున్న సీఎం
  • కాందార్‌లోహలో జరిగే బీఆర్ఎస్ సభకు హాజరుకానున్న సీఎం
Last Updated : Mar 26, 2023, 4:12 PM IST

ABOUT THE AUTHOR

...view details