తెలంగాణ

telangana

ETV Bharat / state

భారాస.. ఇక వడివడిగా.. గుజరాత్‌లో పోటీపై త్వరలో నిర్ణయం

BRS to contest in Gujarat Elections : మునుగోడులో గెలుపుతో తెరాస ఫుల్​ జోష్​లో ఉంది. ఉప ఎన్నికలో విజయాన్ని భారాస తొలి విజయంగా భావిస్తున్న తెరాస అధిష్ఠానం.. ఇదే ఊపులో త్వరలో జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో భారాస ఉనికి చాటేందుకు ఏం చేయాలనే అంశంపై దృష్టి సారించనుంది.

BRS to contest in Gujarat Elections
BRS to contest in Gujarat Elections

By

Published : Nov 7, 2022, 9:27 AM IST

BRS to contest in Gujarat Elections : మునుగోడు ఉప ఎన్నిక విజయం తెరాసలో నూతనోత్సాహం నింపింది. భారత్‌ రాష్ట్ర సమితికి ఇది శుభశకునమని పార్టీ అధిష్ఠానం, శ్రేణులు భావిస్తున్నాయి. మునుగోడులో గెలిస్తే భారాసకు పునాది అవుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్‌, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ ప్రకటించారు. వాస్తవానికి ఉప ఎన్నిక కంటే ముందే భారాసగా పేరు మార్పునకు అవసరమైన ప్రక్రియకు తెరాస శ్రీకారం చుట్టింది.

KCR Plans to contest in Gujarat Election : కొత్త పేరుతోనే ఉప ఎన్నికకు వెళ్తామని కేసీఆర్‌ స్వయంగా పార్టీ కార్యవర్గ సమావేశంలో ప్రకటించారు. సమావేశంలో తీర్మానించిన అనంతరం తెరాస ప్రతినిధి బృందం దిల్లీకి వెళ్లి.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి భారాసగా పేరు మార్పును ఆమోదించాలని వినతిపత్రం సమర్పించింది. దీనిపై ఈసీ వెంటనే నిర్ణయం తీసుకోలేదు. దీంతో మునుగోడులో తెరాస పేరుతోనే ఎన్నికలకు వెళ్లాలని కేసీఆర్‌ నిర్ణయించారు. ఆ పేరుతోనే పార్టీ ప్రచారం చేసింది. ఓటర్లు అయోమయానికి గురికావద్దనే ఉద్దేశంతో భారాస పేరును ఎక్కడా వాడలేదు.

మునుగోడులో విజయంతో ఇప్పుడు భారాసగా ప్రజల ముందుకెళ్లేందుకు తెరాస సన్నద్ధమవుతోంది. ఈసీని కలిసి పేరు మార్పునకు సత్వరమే ఆమోదం తెలపాలని కోరనుంది. ఒకవేళ ఈసీ జాప్యం చేస్తే న్యాయపరంగా పోరాడాలని భావిస్తోంది. పార్టీకి దేశ, రాష్ట్ర కార్యవర్గాలను నియమించనుంది. రాష్ట్ర విభాగానికి మంత్రి కేటీఆర్‌ అధ్యక్షుడిగా ఉండనున్నారు. జాతీయ కార్యవర్గంలో సీనియర్‌ నేతలకు పదవులు ఇవ్వనున్నారు.

త్వరలో జరగనున్న హిమాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌ ఎన్నికల్లో భారాస ఉనికి చాటేందుకు ఏం చేయాలనే అంశంపై పార్టీ దృష్టి సారించనుంది. గుజరాత్‌లోని సూరత్‌ తదితర చోట్ల పోటీ చేయాలని ఆయా రాష్ట్రాల్లోని తెలంగాణ నేతల నుంచి వినతులు వస్తున్నాయి. ఈ అంశంపై సీఎం కేసీఆర్‌ త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు.

ఇవీ చూడండి..

Munugode bypoll: మునుగోడు 'గులాబీ' వశం.. ఫలించిన కేసీఆర్‌ వ్యూహం..!

'ఆ అభ్యర్థిని పోటీ నుంచి తప్పుకోవాలని మోదీ ఒత్తిడి తెచ్చారు'

ABOUT THE AUTHOR

...view details