MLC Kavitha Chennai Tour: బీఆర్ఎస్ జాతీయ ఎజెండాను వివరించేందుకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నై వెళ్లనున్నారు. 2024 ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారనే అంశంపై ఓ సంస్థ నిర్వహించే చర్చలో పాల్గొనున్నారు. చర్చలో కవితతో పాటు డీఎంకే ఎంపీ తిరుచిశివ, బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై, కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ వల్లభ్ పాల్గొంటారని సమాచారం. ఆ వేదిక ద్వారా దళితబంధు, రైతుబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత, కేంద్రంలోని బీజేపీ వైఖరిపై కవిత ప్రసంగించనున్నారు.
ఈ నెల 10న చెన్నైకి ఎమ్మెల్సీ కవిత.. అందుకోసమేనట..! - బీఆర్ఎస్ ఎజెండాను వివరించనున్న కవిత
MLC Kavitha Chennai Tour: ఈ నెల 10న ఎమ్మెల్సీ కవిత చెన్నై వెళ్లనున్నారు. 2024 ఎన్నికల్లో గెలుపుపై ఓ సంస్థ నిర్వహించే చర్చకు హాజరు కానున్నట్లు తెలిసింది. ఈ చర్చలో బీఆర్ఎస్ జాతీయ ఎజెండాను ఎమ్మెల్సీ కవిత వివరించే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వ వైఖరిపై ఆమె ప్రసంగించనున్నారు.
MLC Kavitha