BRS Leader Vinod Kumar Counter To Jeevan Reddy :బీఆర్ఎస్ ఎంపీలపై జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని తెలంగాణ ప్రణాళిక సంఘం మాజీ ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తెలిపారు. భద్రాచలంలోని 7 మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలిపినప్పుడు బీఆర్ఎస్ నేతలు ఏమీ చేయలేదని వారిపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై వినోద్ స్పందించారు. పార్లమెంట్లో జరిగిన చర్చపైజీవన్రెడ్డి మాట్లాడినవన్నీ అసత్యాలన్నారు. పార్లమెంటులో చర్చ, తన వ్యాఖ్యలు రెండూ ఒకసారి చూసుకోవాలని తెలిపారు.
2014 నుంచి 2023 వరకు కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో లెక్క చూసుకోవాలని సూచించారు. కొత్త రాష్ట్రం ఏర్పడినప్పుడు రాజకీయ పరిస్థితులు ఆయనకు అవగాహన అయ్యాయా లేదా అవగాహన లేకుండానే బీఆర్ఎస్ నేతలపై ఆరోపణలు చేసేందుకు ఇలా మాట్లాడారా అని ప్రశ్నించారు.
'బీఆర్ఎస్ నేతలు ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారు - కాళేశ్వరం అవినీతి బయటపెడతాం'
BRS Leader Vinod Kumar Fires on Jeevan Reddy : ఆరోజు సమావేశంలో ఎంత పెద్ద చర్చ జరిగిందో జీవన్‌రెడ్డికి తెలుసన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు కూడా స్పందించకుండా ఉంటే మౌనమే అంగీకారం అంటారని తెలిపారు. ఆరోజు పార్లమెంటు మండలాల కోసం తీవ్రంగా పోరాడి చర్చకు దిగింది తానని చెప్పారు. ఆ రోజు జరిగిన చర్చకు సంబంధించిన వీడీయోలు ఉన్నాయని తెలిపారు. ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం ఐదేళ్ల నుంచి కాంగ్రెస్, బీజేపీ వాళ్లు చేసిన వ్యాఖ్యలేనని ఆరోపించారు.