BRS Election Campaign in Telangana మ్యానిఫెస్టో ప్రకటనతో జోరందుకున్న బీఆర్ఎస్ నాయకుల ప్రచారాలు.. ఎన్నికల రథాలతో బరిలోకి అభ్యర్థులు BRS Election Campaign in Telangana :తెలంగాణలో ముచ్చటగా మూడోసారి విజయఢంకా మోగించేందుకు అధికార బీఆర్ఎస్ అన్నిరకాలుగా బరిలోకి దిగేందుకు సమాయత్తమౌతోంది. తాజాగా సబ్బండ వర్గాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్(CM KCR).. ఆదివారం తమ పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టోను రిలీజ్ చేశారు. అంతేకాక అభ్యర్థులకు బీఫాంలు అందించారు. దీంతో పార్టీ శ్రేణులు మ్యానిఫెస్టోలోని అంశాల్ని వివరిస్తూ ప్రచారజోరుకు శ్రీకారం చుట్టారు. మరోసారి విజయకేతనం ఎగురవేసేందుుకు అవకాశం ఇవ్వాలంటూ ప్రజల్ని అభ్యర్థిస్తున్నారు.
BRS Manifesto 2023 in Telangana :ఓవైపు ముఖ్యమంత్రి ప్రజా ఆశీర్వాదసభలతో జనంలోకి వెళ్తుంటే.. అభ్యర్థులు సైతం ఇంటింటి(Door-to-Door Campaign) ప్రచారానికి శ్రీకారం చుట్టారు. కేసీఆర్ ఆశీస్సులతో నకిరేకల్ గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగురవేస్తామని చిరుమర్తి లింగయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. చెర్వు గట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో ప్రచారరథానికి పూజలు చేసి ప్రచారాన్ని ప్రారంభించారు.
BRS Manifesto 2023 : తెల్లరేషన్ కార్డుదారులకు 'కేసీఆర్ బీమా.. ప్రతి ఇంటికి ధీమా'.. రూ.4 వందలకే గ్యాస్ సిలిండర్
నల్గొండ జిల్లా ఆమనగల్లు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన గులాబీ పార్టీ అభ్యర్థి నల్లమోతు భాస్కరరావు.. ఇంటింటి ప్రచారాన్ని ప్రారంభించారు. మేనిఫెస్టోలో అంశాలను ప్రజలకు వివరిస్తూ.. బీఆర్ఎస్కు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలపై విపక్ష కాంగ్రెస్, బీజేపీలు(BJP Party) అర్థంలేని విమర్శలు చేస్తున్నాయని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విమర్శించారు.
BRS Campaign Start in Telangana Election : నారాయణపేట జిల్లా క్యాతన్‌పల్లిలో శ్రీ వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ద్విచక్రవాహనాల ర్యాలీ నిర్వహించి ప్రచార శంఖం పూరించారు. వనపర్తి జిల్లా గట్టుకాడిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేసి.. ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
CM KCR Speech at Jangaon Praja Ashirwada Sabha : 'ఓటు మన తలరాతను మార్చేస్తుంది.. ఎన్నికలప్పుడు వచ్చి ఆపద మొక్కులు మొక్కేవారిని నమ్మొద్దు'
సాగునీటి ప్రాజెక్టులలో(Irrigation Projects) కాల్వలకు లైనింగ్ చేసి సాగునీటి వ్యవస్థను ఆధునీకరిస్తామన్నారు. పదేళ్లలో ఏం అభివృద్ధి జరిగిందో ప్రజల కళ్లముందే ఉందని.. అలాంటి పార్టీని గెలిపంచుకోవాల్సిన బాధ్యత నాయకులదేనన్నారు. కరవు, వలసలతో అల్లాడిన పాలమూరు జిల్లాను సాగు, తాగునీళ్ల కష్టాలుతీర్చడం ప్రభుత్వ విజయమని తెలిపారు.
BRS Door to Door Campaign in Telangana :హైదరాబాద్‌లోనూ గులాబీ పార్టీ అభ్యర్థులు.. ప్రచార జోరును పెంచారు. మ్యానిఫెస్టోలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి పెద్ద పీట వేశారని ఆ పార్టీ అభ్యర్థి కాలేరు వెంకటేశ్ అన్నారు. అంబర్‌పేట్‌లోని నల్ల పోచమ్మ గుడి నుంచి పాదయాత్ర చేస్తూ ఓటు అభ్యర్థించారు. అరికెపూడి గాంధీ కూకట్పల్లి డివిజన్ పరిధిలోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీనబంధు కాలనీలో ఇంటింటి ప్రచారం చేశారు. బీఆర్ఎస్ సర్కార్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గ అభివృద్ధిని వివరించారు.
Ponnala Lakshmaiah joined BRS : జనగామ అత్యున్నత అభివృద్ధి కోసమే బీఆర్‌ఎస్‌లోకి.. గులాబీ గూటికి చేరిన పొన్నాల