BRS Celebrates Telangana National Integration Day నేడు తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవం.. రాష్ట్రప్రభుత్వం ఆధ్వర్యంలో సంబురాలు BRS Celebrates Telangana National Integration Day :బీఆర్ఎస్ సర్కార్ ఆధ్వర్యంలో తెలంగాణ జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని(Telangana National Integration Day) నిర్వహించారు. అసెంబ్లీలో అంబేద్కర్, మహాత్మాగాంధీ విగ్రహాలకు.. స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రోనాల్డ్‌రాస్ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
KCR At Telangana National Integration Day 2023 : ''తెలంగాణ ఆచరిస్తోంది.. దేశం అనుచరిస్తోంది' అనేది అక్షర సత్యం'
Telangana National Unity Day :హైదరాబాద్ బీఆర్ఎస్(BRS) కేంద్ర కార్యాలయంలో ఎంపీ కె.కేశవరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి ఎంతో మంది అమరవీరులు ప్రాణాలర్పించారని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో మంత్రి మల్లారెడ్డి అన్నారు. రంగారెడ్డి కలెక్టకరేట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి జాతీయ పతాకావిష్కరణ చేశారు.
త్యాగధనుల పోరాట ఫలితంగా నిరంకుశ పాలన నుంచి భారత్‌లో అంతర్భాగమైందని.. ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌అన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే రేగా కాంతారావు జాతీయ జెండా ఆవిష్కరించారు. యాదాద్రి భువనగిరి కలెక్టరేట్‌లో ఎమ్మెల్యే సునీతా మహేందర్‌రెడ్డి, నల్గొండ పోలీస్ పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
September 17 Celebrations in Telangana :జనగామలో మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు అమరవీరులకు నివాళులు అర్పించారు. మహబూబాబాద్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి సత్యవతి రాథోడ్ విద్యార్థులు, అధికారులతో కలిసి కోలాటం వేశారు. భూపాలపల్లిలో వేడుకల్లో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. ములుగు కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.
Harishrao Distributes Gruhalakshmi Documents : తిట్ల ప్రభుత్వం కావాలా?.. కిట్ల ప్రభుత్వం కావాలా?
BRS Latest News :కరీంనగర్ పోలీసు పరేడ్ గ్రౌండ్‌లో.. మంత్రి గంగుల కమలాకర్, పెద్దపల్లి కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ భానుప్రసాద్‌రావు వేడుకల్లో పాల్గొన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్‌లో మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి.. స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ అవార్డులు అందజేశారు. స్వరాష్ట్రంలో తెలంగాణ అభివృద్ధిలో అగ్రగ్రామిగా దూసుకెళ్తోందని నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
సంగారెడ్డి కలెక్టరేట్‌లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ, సిద్దిపేట కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో మంత్రి హరీశ్‌రావుపాల్గొన్నారు. ప్రజాస్వామ్య తెలంగాణ కోసం ప్రాణాలర్పించిన అమరవీరుల త్యాగాల్ని హరీశ్‌రావు స్మరించుకున్నారు. మెదక్ కలెక్టరేట్‌లో మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. నాగర్‌కర్నూల్‌లో పోలీసు పరేడ్ మైదానంలో జరిగిన వేడుకల్లో.. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు పాల్గొన్నారు.
నారాయణపేటలో రాష్ట్ర మహిళ కమిషన్ ఛైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, గద్వాల కలెక్టరేట్‌లో జరిగిన వేడుకల్లో పాల్గొన్న డిప్యూటీ స్పీకర్ పద్మారావు.. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్‌లో మంత్రి మల్లారెడ్డి, రంగారెడ్డి కలెక్టకరేట్‌లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వేడుకల్లో పాల్గొన్నారు. మహబూబ్‌నగర్ కలెక్టర్‌లో జరిగిన వేడుకలకు హాజరైన హాజరైన మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అమరవీరుల త్యాగాల్ని గుర్తుచేశారు.
Tamilisai in Telangana Liberation Day Celebrations : "స్వేచ్ఛ, సమైక్యతలకు నిదర్శనం.. హైదరాబాద్ విమోచన దినోత్సవం"
Amit Shah Speech at Telangana Liberation Day 2023 : 'పటేల్ లేకపోతే.. తెలంగాణకు ఇంత త్వరగా విముక్తి లభించేది కాదు'