BRS 30 Days Election Campaign Plan in Telangana: ఎన్నికల ప్రచారానికి మరో నెల రోజులు మాత్రమే ఉండటంతో నగరంలో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో ప్రచారంపై దృష్టి పెట్టింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్దిని ప్రజలకు చూపించి.. గత ఎన్నికల్లో వచ్చిన సీట్ల కంటే ఎక్కువ దక్కించుకునేందుకు 'స్వాతిముత్యం(Swathimutyam Movie)' సినిమా ఫార్ములాను ఉపయోగించాలని కార్యకర్తలకు సూచించింది.
BRS Use Swathimutyam Formula for Election Campaign: అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇప్పటికే బూత్ స్థాయి కమిటీలను అభ్యర్థులు ఏర్పాటు చేశారు. వీరు రాబోయే 30 రోజులపాటు తమకు కేటాయించిన 100 మంది ఓటర్లను కలుసుకుని ఓటు అభ్యర్థించాలని పార్టీ ఆదేశించింది. ఒకసారి అడిగి వదిలేయకుండా 30 సార్లైనా వారిని కలవాలని కార్యకర్తలకు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. స్వాతిముత్యం సినిమాలో సోమయాజులు ఉద్యోగం ఇస్తా అని హామీ ఇచ్చే వరకు కమలహాసన్ వదిలిపెట్టలేదని.. అలాగే తమకు ఓటు వేస్తామని హామీ ఇచ్చే వరకు ఓటరును రోజూ కలుస్తూనే ఉండాలని సూచించారు.
KTR Instruction to BRS Followers: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని.. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న దానితో పోల్చి చెప్పి స్పష్టంగా వివరించాలని కేటీఆర్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో హూషారుగా ఉండాలని.. అందరితో కలిసి ముందుకు సాగాలని సూచించారు. ఈ నెల మరింత కీలకమని.. ప్రజలకు బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన పథకాలు, వాటి విజయాలను స్పష్టంగా వివరించాలని.. మళ్లీ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తమ వంతు కృషి చేయాలని కోరారు.
BRS Election Campaign in Full Josh : ఇంటింటి ప్రచారంతో నేతలు.. గెలుపు వేటలో గులాబీ పరుగులు
BRS Election Campaign on Social Media: సోషల్ మీడియాలో దుమ్మురేగేలా.. చాలా రోజుల క్రితం జరిగిన విషయాలను ప్రజలు మర్చిపోవడం సహజమని.. అప్పుడు, ఇప్పుడు మార్పు తెలిపే చోట ఫొటోలు దిగిసామాజిక మాధ్యమాల్లో పోస్టుచేయాలని క్యాడర్‌కు సూచించారు. క్షేత్రస్థాయి, గ్రామ, మండల స్థాయిలో వాట్సాప్ గ్రూపులు(Campaign in Whats app Groups) తయారు చేసి.. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని తెలియజేయాలని అన్నారు. మరి ముఖ్యంగా స్థానికంగా జరిగిన విషయాలను పోస్ట్ చేయాలని విజ్ఞప్తి చేశారు.