ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా... ప్రౌల్టీ రంగంపై చాలా ప్రభావం చూపిస్తోంది. వైరస్ ప్రభావం వల్ల హైదరాబాద్ నగర ప్రజలు చికెన్ తినేందుకు ఆసక్తి చూపకపోవడం వల్ల వ్యాపారులు మైక్‌లో అనౌన్స్ చేస్తూ.. విక్రయించే పరిస్థితి నెలకొంది. నాంపల్లి చికెన్ మార్కెట్లో ఈ దృశ్యం దర్శనమిచ్చింది.
కరోనా ఎఫెక్ట్: చికెన్ కిలో 20 రూపాయలే..! - నాంపల్లిలో చికెన్ కిలో 20 రూపాయలే
చికెన్ తింటే కరోనా రాదని ప్రభుత్వం చెబుతున్నా... ప్రజలు మాత్రం నమ్మడం లేదు. చికెన్ తింటే కరోనా వస్తుందనే భయంతో... దాని జోలికి పోవడం లేదు నగరవాసులు. దీనితో చికెన్ ధరలు అమాంతం తగ్గిపోయాయి. నాంపల్లి చికెన్ మార్కెట్లో కిలోకి 20 రూపాయలే అంటూ మైక్‌లో అనౌన్స్ చేస్తూ విక్రయిస్తున్నారు వ్యాపారులు.
కరోనా ఎఫెక్ట్: చికెన్ కిలో 20 రూపాయలే..!
ఎప్పుడు రద్దీగా ఉండే మార్కెట్ కొద్దిరోజులుగా జనాలు లేక విలవిలబోతుంది. అమ్మకాలు పెంచుకునేందుకు వ్యాపారులు మైక్‌లో కిలో 20 రూపాయలు మాత్రమే అంటూ ప్రచారం చేస్తూ విక్రయిస్తున్నారు.
ఇవీ చూడండి:సీతారాములను వదలని కరోనా.. కల్యాణంపై కొవిడ్-19 ఎఫెక్ట్