మానవ అక్రమ రవాణాను నిరోధించడానికి పోరాడుతున్న.. పోలీస్ శాఖకు చెందిన మహిళా భద్రతా విభాగానికి తమ సంపూర్ణ సహకారం అందిస్తామని బ్రిటీష్ హై కమిషనర్ ఎల్లిస్ తెలిపారు. హైదరాబాద్‌లోని కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. విభాగం పని తీరును కొనియాడుతూ.. మహిళలు, పిల్లల భద్రత కోసం చేపడుతోన్న పలు కార్యక్రమాల గురించి వారినడిగి తెలుసుకున్నారు. హ్యూమన్ ట్రాఫికింగ్‌పై ఆన్ లైన్ సదస్సు నిర్వహించారు.
మహిళా భద్రతా విభాగంపై బ్రిటీష్ హై కమిషనర్ ప్రశంసలు
హైదరాబాద్ డీజీపీ కార్యాలయంలోని.. మహిళా భద్రతా విభాగాన్ని బ్రిటీష్ హై కమిషనర్ ఎల్లిస్ సందర్శించారు. 'హ్యూమన్ ట్రాఫికింగ్'పై ఆన్ లైన్ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.
మహిళ భద్రతా విభాగంపై బ్రిటీష్ హై కమిషనర్ ప్రశంసలు
ఈ సదస్సులో పాల్గొన్న డీజీపీ మహేందర్ రెడ్డి.. మానవ అక్రమ రవాణా అనేది అతి హేయమైన చర్య అని పేర్కొన్నారు. దాన్ని నివారించడానికి కలిసికట్టుగా పోరాడాలని సూచించారు. పోలీసులతో పాటు ఇతర ప్రభుత్వ శాఖలు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి:తమిళ బరిలో తెలుగు వెలుగులు!