తెలంగాణ

telangana

ETV Bharat / state

పేద బ్రాహ్మణులపై కరోనా ప్రభావం

లాక్​డౌన్​ కారణంగా పేద బ్రాహ్మణులు ఇబ్బందులు పడుతున్నారు. సాయం కోసం ఎదురు చూస్తూ... దాతలు ఇచ్చే ఆహార పొట్లాలతోనే కుటుంబాన్ని పోషించుకుంటున్నామని వాపోతున్నారు. తమ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకుని... తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

brahmins-struggles-in-lock-down-time-at-hyderabad
పేద బ్రాహ్మణులపై కరోనా ప్రభావం

By

Published : Apr 21, 2020, 3:46 PM IST

నిత్యం చిన్న చిన్న శుభకార్యాలు నిర్వహించే బ్రాహ్మణులు లాక్‌డౌన్‌తో వీధిన పడ్డారు. ఎవరైనా వచ్చి ఆపన్నహస్తం అందిస్తారేమోనని... చిక్కడపల్లి వీధుల్లో సాయం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు ఇచ్చే ఆహార పొట్లాలతోనే కడుపునింపుకుంటున్నామని తెలిపారు. కుటుంబ పోషణ సైతం భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పనిలేక ఇబ్బందులు..

లాక్​డౌన్​ కారణంగా ఇంట్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని బ్రాహ్మణులు వాపోయారు. తినడానికి తిండి లేక... కరెంటు బిల్లులు కట్టుకోలేకపోతున్నామని వాపోయారు. ఎవరైనా ఆర్థిక సాయం చేస్తారు... ఏదైనా పని దొరుకుతుందనే ఆశతో రోజు ఇక్కడికి వస్తున్నామని తెలిపారు.

ఇంట్లో వాళ్లు భయపడుతున్నారు...

ఇలా పని కోసం, సాయం కోసం బయటకు వస్తుంటే ఇంట్లో వాళ్లు భయపడుతున్నారని... కానీ వారిని పోషించేందుకే మేము బయటకు వస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

పేద బ్రాహ్మణులపై కరోనా ప్రభావం

తోచినంత సాయం...

ఇక్కడ ఉండె బ్రాహ్మణుల పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. అందుకే 15 రోజుల నుంచి మా సంస్థ తరఫున తోచినంత సాయం చేస్తున్నామని దాతలు తెలిపారు. ఆదివారం మాత్రం పప్పులు, బియ్యం అందజేస్తున్నామని వెల్లడించారు.

జీహెచ్​ఎంసీ నుంచి అనుమతి తీసుకుని... 15 రోజులకు సరిపడా నిత్యవసరాలను అందిస్తున్నామని స్వచ్ఛంద సంస్థలు తెలిపాయి.

ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి... ఆర్థికంగా ఆదుకోవాలని బ్రాహ్మణులు వాపోతున్నారు.

ఇవీ చూడండి:చాపకింద నీరులా కరోనా... ఈ మహమ్మారి ఆగేనా?

ABOUT THE AUTHOR

...view details