తెలంగాణ

telangana

ETV Bharat / state

'శాంతిభద్రతల స్థాపనలో ఐపీఎస్​ల పాత్ర కీలకం' - ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య

సమాజంలో అన్ని స్థాయిల్లో మార్పు తెచ్చే సామర్థ్యాన్ని ఐపీఎస్​లు కలిగి ఉన్నారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు. తెలంగాణకు కేటాయించిన 2019 బ్యాచ్​కు చెందిన ఐదుగురు ఐపీఎస్ శిక్షణ అధికారులకు మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో దృక్పథ అవగాహన శిక్షణా కార్యక్రమం నిర్వహించారు.

bp acharya training to trainee ips
'శాంతిభద్రతలు స్థాపించడంలో ఐపీఎస్​లు కీలక భూమిక పోషిస్తున్నారు'

By

Published : Aug 6, 2020, 6:22 AM IST

ఐపీఎస్ అధికారులు అట్టడుగు స్థాయిలోనూ శాంతిభద్రతలు స్థాపించడంలో కీలక భూమిక పోషిస్తున్నారని.. సమాజంలో అన్ని స్థాయిల్లో మార్పు తెచ్చే సామర్థ్యాన్ని ఐపీఎస్​లు కలిగి ఉన్నారని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య అన్నారు.

నేరాల మూలకారణాలను విశ్లేషించి అర్థం చేసుకొని వాటిని సమర్థంగా ప రిష్కరించాలని ఆయన సూచించారు.సివిల్స్ ఫలితాల్లో 46 ర్యాంక్ సాధించిన ధాత్రి రెడ్డిని బీపీ ఆచార్య అభినందించారు.

ఇవీ చూడండి: ఎన్ని కేసులు వచ్చినా చికిత్స అందించేందుకు ప్రభుత్వం సిద్ధం

ABOUT THE AUTHOR

...view details