కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడవ వార్డులో రెండు పడకల గదుల ఇంటి నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. స్థానిక ఎమ్మెల్యే సాయన్న ఆదేశాల మేరకు బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, మాజీ మార్కెట్ బోర్డు సభ్యుడు ప్రభాకర్‌తో కలిసి నిర్మాణ పనులను పరిశీలించారు. డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించకుండా చూడాలని కాంట్రాక్టర్‌కి సూచించారు. దీపావళి నాటికి అర్హులైన స్థానికులకు డబుల్ బెడ్రూం ఇళ్లు అందిస్తామని ఆయన తెలిపారు. ఇల్లు లేని పేదల కోసం తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇల్లు నిర్మించి పేద ప్రజలకు అందిస్తున్నదని ఆయన తెలిపారు.
కంటోన్మెంట్లో శరవేగంగా డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు! - కంటోన్మెంట్ నియోజకవర్గం
కంటోన్మెంట్ నియోజకవర్గంలోని మూడవ వార్డులో డబుల్ బెడ్రూం నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని బోయిన్పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్ అన్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న ఆదేశాల ప్రకారం డబుల్ బెడ్రూమ్ నిర్మాణ పనులను పరిశీలించినట్టు ఆయన తెలిపారు.
కంటోన్మెంట్లో శరవేగంగా రెండు పడకల ఇళ్లు నిర్మాణ పనులు!