తెలంగాణ

telangana

ETV Bharat / state

మహిళను రక్షించబోయి... కొట్టుకుపోయాడు! - విజయవాడ

ఆంధ్రప్రదేశ్​ కృష్ణజిల్లా విజయవాడలోని బీఆర్​టీఎస్​ రోడ్డు సమీపంలోని రైవస్​ కాలువలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను గమనించిన ముగ్గురు యువకులు కాపాడే ప్రయత్నం చేసి ఆమెను ఒడ్డుకు చేర్చారు. కానీ... ఓ యువకుడు గల్లంతయ్యాడు.

రక్షించబోయి..తానే కొట్టుకపోయాడు..!

By

Published : Aug 20, 2019, 5:06 PM IST

ఆంధ్రప్రదేశ్​ కృష్ణా జిల్లా విజయవాడలోని బీఆర్​టీఎస్​ రోడ్డు సమీపంలో రైవస్‌ కాలువలో దూకి ఓ మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆమెను గమనించిన ముగ్గురు యువకులు.. రక్షించేందుకు కాలువలోకి దూకారు. ఇద్దరు యువకులు ఆమెను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. ఓ యువకుడు మాత్రం నీటి ప్రవాహానికి కొట్టుకుపోయాడు. అతని కోసం స్థానికులు గాలిస్తున్నారు. గల్లంతైన వ్యక్తి ఇబ్రహీంపట్నం మండలం ఫెర్రీకి చెందిన శివరామకృష్ణగా అతని మిత్రులు తెలిపారు.

రక్షించబోయి..తానే కొట్టుకపోయాడు..!

ABOUT THE AUTHOR

...view details