సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో 11 నెలల బాలుడు కిడ్నాప్ అయిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో బాబును గాంధీ ఆస్పత్రి జయశంకర్ విగ్రహం వెనుక నుంచి ఓ వ్యక్తి నడిపించుకుంటూ తీసుకెళ్తున్న వ్యక్తిని పోలీసులు గుర్తించారు.
గాంధీ ఆసుపత్రిలో బాలుడి కిడ్నాప్
గాంధీ ఆసుపత్రిలో తన బంధువులను చూడటానికి వచ్చిన తల్లితో ఉన్న బాలుడిని ఆగంతుకులు ఎత్తుకెళ్లారు. ఈరోజు తెల్లవారుజామున జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సీసీ కెమెరాలో బాబును ఓ వ్యక్తి నడిపించుకుంటూ తీసుకెళ్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
మౌలాలి ప్రాంతానికి చెందిన రాధిక కొద్ది రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి తన బంధువులను చూసేందుకు వచ్చింది. అప్పటి నుంచి మౌలాలికి వెళ్ళలేదు. బాధిత మహిళలకు ఇళ్లు లేకపోవడం వల్ల గాంధీ ఆసుపత్రి వెయిటింగ్ గదిలో తన కొడుకుతో బస చేస్తోంది. ఈరోజు తెల్లవారు జామున సుమారు నాలుగు గంటలకు గుర్తు తెలియని వ్యక్తులు ఆ బాలుడిని కిడ్నాప్ చేసి పరారయ్యారు. బాధిత మహిళ రాధిక చిలకలగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి : భాగ్యనగరంలో ప్లాస్టిక్ రహిత వీధి వ్యాపారుల ప్రాంతం అదే..!!