తెలంగాణ

telangana

ETV Bharat / state

సిమెంటు బల్ల మీదపడి  బాలుడు మృతి - attapur

పార్కులో ఆడుకునేందుకు వెళ్లిన కొడుకు కోసం తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ఆడుకుంటూనే అనంతలోకాలకు వెళ్లిపోయిన చిన్నారిని చూసి తల్లడిల్లిపోయారు. ఈ ఘటన రాజేంద్రనగర్​ అత్తాపూర్​ హైదర్​గూడలో చోటుచేసుకుంది.

boy-died-in-attapur

By

Published : Apr 26, 2019, 9:11 AM IST

Updated : Apr 26, 2019, 12:36 PM IST

హైదరాబాదు శివారు రాజేంద్రనగర్​ అత్తాపూర్​ హైదర్​గూడలో విషాదం జరిగింది. జనప్రియ అపార్టుమెంటు పార్కులో ఆడుకుంటున్న ఆరేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు మరణించాడు. బిశాన్​శర్మ అనే బాలుడిపై సిమెంటు బల్ల పడిపోవడం వల్ల తలకు బలమైన గాయమై ప్రాణాలు కోల్పోయాడు. పార్కులో విరిగిపోయిన బల్లలు ఉండటం వల్లే తమ కుమారుడు మృతిచెందాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఘటనపై రాజేంద్రనగర్​ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సిమెంటు బల్లమీద పడి బాలుడు మృతి
Last Updated : Apr 26, 2019, 12:36 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details