హైదరాబాద్ నగర శివారు శంషాబాద్లో విషాదం జరిగింది. యాసిడ్ తాగిన పన్నెండు నెలల వయసున్న బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. శంషాబాద్ పట్టణంలోని హైమాద్ నగర్ కాలనీకి చెందిన ఉస్మాన్ అనే వ్యక్తి ఇంటి అవసరాల కోసం యాసిడ్ బాటిల్ తెచ్చాడు. అతని కుమారుడు ఆజాం బుధవారం సాయంత్రం నీళ్లు అనుకుని తాగేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న కొడుకు అకాల మృతితో తల్లిదండ్రులు శోకసంద్రంలో మునిగిపోయారు.
యాసిడ్ తాగి 12 నెలల బాలుడు మృతి - boy died
మంచినీళ్లు అనుకుని యాసిడ్ తాగి పన్నెండు నెలల వయసున్న బాలుడు మృతిచెందాడు. హైదరాబాద్ శివారు శంషాబాద్లో జరిగిన ఈ ఘటన ఆ కుటుంబంలో విషాదం నింపింది.
యాసిడ్ తాగి 12 నెలల బాలుడు మృతి