తెలంగాణ

telangana

ETV Bharat / state

కిసాన్​ రైలుతో రైతులకు మేలు : బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్

కిసాన్​ రైలు ప్రారంభంతో రైతులకు ఎంతో లాభం చేకూరనుందని... సికింద్రాబాద్​ బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ అన్నారు. దేశవ్యాప్తంగా కూరగాయల రవాణా కోసం కిసాన్ రైలు ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు ఆయన తెలిపారు.

BowenPally Market Chairman meeting with South Central Railway officials
'కిసాన్​ రైలుతో రైతులకు ఎంతో లాభం చేకూరనుంది'

By

Published : Jan 20, 2021, 7:38 PM IST

దేశవ్యాప్తంగా కూరగాయల రవాణాకు ఏర్పాటు చేసిన కిసాన్ రైలు.. ఫిబ్రవరిలో ప్రారంభం కానున్నట్లు సికింద్రాబాద్​ బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ శ్రీనివాస్ తెలిపారు. దక్షిణ మధ్య రైల్వే అధికారులు, బోయిన్​పల్లి మార్కెట్ కమిటీ ఏజెంట్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

కిసాన్​ రైలు వల్ల రైతులకు ఎంతో లాభం చేకూరనుందని శ్రీనివాస్ అన్నారు. దీని ద్వారా వివిధ రాష్ట్రాల నుంచి కూరగాయలను బోయిన్​పల్లి మార్కెట్​కు... అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే విషయాలపై రైల్వే అధికారులతో సుదీర్ఘంగా చర్చించినట్లు తెలిపారు.

ఇదీ చదవండి: ఆ భూములన్నీ ప్రభుత్వానియే : శేరిలింగంపల్లి డిప్యూటీ కమిషనర్

ABOUT THE AUTHOR

...view details