Bosch in Hyderabad: హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ సంస్థ బాష్ (Bosch) రాబోతుంది. మొబిలిటీ, ఇండస్ట్రీయల్ ఇంజినీరింగ్, గృహోపకరణాలలో ప్రపంచ అగ్రగామిగా ఉన్న బాష్ సంస్థ... తమ బాష్ గ్లోబల్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం హైదరాబాద్‌ను ఎంచుకుందని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. బాష్ సంస్థ రాకతో... సుమారు 3,000ల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయని మంత్రి కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు.
రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎలాంటి సహకారం అందడంలేదని కేటీఆర్ ఇటీవల పదేపదే చెబుతూ వస్తున్నారు. ఇటీవల ట్విట్టర్లో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి, ఆయనకు మాటల యుద్ధం నడిచింది. కేంద్రం సహాయం చేయకపోయినా తాము ముందుకెళ్తున్నామని కేటీఆర్ అన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మంజూరు చేయకపోయినా... మేధ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెట్టుకున్నామని కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. ఇటీవలే మేధా రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఫొటోలను ఆయన ట్విట్టర్ వేదికగా షేర్ చేశారు.