Booster Dose In Telangana : రాష్ట్రంలో రేపటి నుంచి బూస్టర్ డోసు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. హెల్త్‌కేర్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లు, 60 ఏళ్లు పైబడిన వారికి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. వారు బూస్టర్ డోసు కోసం ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా గతంలో ఉన్న రిజిస్ట్రేషన్‌తోనే బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. అందుకోసం కొవిన్‌లో స్లాట్ బుకింగ్ ద్వారా నేరుగా టీకా కేంద్రానికి వెళ్లే వెసులుబాటును కల్పించారు.
Booster Dose In Telangana : రాష్ట్రంలో రేపటి నుంచి బూస్టర్ డోస్... వారికి మాత్రమే - హైదరాబాద్ వార్తలు
Booster Dose
14:22 January 09
రాష్ట్రంలో రేపటి నుంచి బూస్టర్ డోస్ ప్రారంభం
వారికి మాత్రమే...
కొవిడ్ వ్యాక్సిన్ రెండో డోసు వేసుకుని 9 నెలలు పూర్తైన వారికి, 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిగా ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8.3 లక్షల మంది 60 ఏళ్లు పైబడి దీర్ఘ కాలిక వ్యాధులతో బాధపడుతున్న వారు ఉన్నట్టు ప్రభుత్వం అంచనా.
ఇదీ చూడండి:Corona Effect on Pregnant Woman : కరోనా కాలంలో కాబోయే అమ్మ.. జర జాగ్రత్తమ్మా..!
Last Updated : Jan 9, 2022, 3:23 PM IST