మామూలుగా పండుగ అంటే పిండివంటలు వండుకోవడం, బంధువులు ఇంటికి రావడం. కానీ ఈ గిరిజిన గ్రామంలో మాత్రం చెట్ల కొమ్మలతో కొట్టుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. ఒడిశాలోని మల్కాన్గిరి జిల్లాలో గల బోండా ఘాట్లో ఏటా పుష్యమాసంలో ఈ వింత పండుగను జరుపుకుంటారు.
వింత సంబరం: చెట్టు కొమ్మలతో దాడి చేసుకోవడమే ఆచారం!
బోండా ఘాట్లో వింత పండుగ.. 'ఈ జటి పరబ్' పండుగను గిరిజనులు శుక్రవారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ పండుగ ఆచారం ఏంటంటే చెట్టు కొమ్మలతో వీపుపై కొట్టడం. కొట్టుకున్న వారు ఎటువంటి శత్రుత్వం ఉంచుకోకుండా చూసుకోవాలి.
vinta sambaram
శుక్రవారం రోజు ఈ జటి పరబ్ ను గ్రామ వాసులంతా ఘనంగా జరుపుకున్నారు. పురుషలంతా దాదాపు 2 గంటల పాటు కొమ్మలతో వీపుపై దాడి చేసుకున్నారు. అయితే వాళ్ల మధ్య ఎటువంటి శత్రుత్వం ఉంచుకోకుండా తరతరాలుగా ఈ పండుగను జరుపుకుంటున్నామని గిరిజనలు చెప్తున్నారు.