హైదరాబాద్ అంబర్‌పేటలోని మహంకాళీ అమ్మవారి ఆలయంలో బోనాల ఉత్సవాలు వైభవంగా జరిగాయి. వేకువ జామునుంచే భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి బోనం, చీర, సారెను సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. అంబర్‌పేట నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అమ్మవారిని దర్శించుకున్నారు. బోనాల వేడుకలు లోకకల్యాణం కోసం జరిపేవని.. రాష్ట్రంలో సంవృద్ధిగా వర్షాలు కురిసి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు కిషన్‌రెడ్డి తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయ కమిటీ సిబ్బంది ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
అంబర్‌పేట మహంకాళీ ఆలయంలో వైభవంగా బోనాలు - indrakaran reddy
భాగ్యనగర వ్యాప్తంగా బోనాల సంబురాలు అంగరంగ వైభవంగా జరిగాయి. అమ్మవారి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. అంబర్‌పేటలోని మహంకాళీ ఆలయంలో బోనాల ఉత్సవాలు కన్నల పండువలా జరిగాయి. అమ్మవారిని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి కుటంబ సమేతంగా దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు.
అంబర్‌పేట మహంకాళి ఆలయంలో వైభవంగా బోనాలు