తెలంగాణ

telangana

ETV Bharat / state

భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కోసం గాలింపు ముమ్మరం - police searching for bhargav ram and srinu

బోయిన్​పల్లి అపహరణ కేసులో పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్​తో పాటు గుంటూరు శ్రీను ముఠా కోసం గాలింపు నిర్వహిస్తున్నారు.

భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కోసం గాలింపు ముమ్మరం
భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కోసం గాలింపు ముమ్మరం

By

Published : Jan 10, 2021, 2:16 PM IST

బోయిన్​పల్లి అపహరణ కేసులో నిందితులుగా ఉన్న భార్గవ్ రామ్​తో పాటు గుంటూరు శ్రీను ముఠా కోసం పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు. ఏపీ గుంటూరు, కర్నూల్​తో పాటు కర్ణాటకలోని పలు ప్రాంతాల్లో గాలింపు నిర్వహిస్తున్నారు. గుంటూరు శ్రీను ముఠాలోని కొంత మంది సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది.

వీళ్లు చెప్పిన సమాచారం ఆధారంగా భార్గవ్ రామ్, గుంటూరు శ్రీను కోసం పోలీసు బృందాలు గాలింపు చేపట్టారు. ఒకట్రెండు రోజుల్లో భార్గవ్ రామ్​ను పట్టుకునేందుకు పోలీసులు ముమ్మర కృషి చేస్తున్నారు. భార్గవ్ రామ్ పోలీసులకు చిక్కకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ఫోన్​లో మాట్లాడితే సిగ్నల్ ఆధారంగా చిక్కిపోతామనే ఉద్దేశంతో ఇతర మార్గాల్లో న్యాయవాదులతో సంప్రదింపులు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎవరితోనైనా మాట్లాడాల్సి వస్తే కొత్త నెంబర్ ఆధారంగా వాట్సాప్​లో సంభాషిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:పులుల సంచారంపై ఎంపీ సోయం సంచలన వ్యాఖ్యలు

ABOUT THE AUTHOR

...view details