ఏపీలోని గోదావరి బోటు ప్రమాద దుర్ఘటనలో ఎనిమిదో రోజు ఒక్క మృతదేహమే లభ్యమైంది. ఆదివారం ఉదయం దేవీపట్నం నుంచి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే ఆ మృతదేహాన్ని ఇంకా గుర్తించాల్సి ఉంది. నిన్న లభ్యమైన ఐదేళ్ల బాలిక కుశాలి మృతదేహాన్ని ఇంకా బంధువులు తీసుకెళ్లలేదు. డ్రైవర్లతో పాటు ఇంకా 14 మంది ఆచూకీ తెలియక వారి బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
బోటు ప్రమాద ఘటనలో మరో మృతదేహం లభ్యం
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం ఎదుర్లంక వద్ద గౌతమి గోదావరిలో... ఓ మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఒడ్డుకు చేర్చారు. ముమ్మిడివరం సీఐ, ఐ.పోలవరం పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి ఎటువంటి ఆధారం లభించకపోవడం కారణంగా... బోటు ప్రమాదానికి సంబంధించినదని భావించి రాజమహేంద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
మరో మృతదేహం లభ్యం
కచ్చులూరు ప్రాంతంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెబుతున్నా... తేలిన మృతదేహాలనే ఒడ్డుకు చేరుస్తున్నారు. అంతే తప్ప ఎలాంటి గాలింపు చర్యలు జరగడం లేదు. బోటును వెలికితీస్తామని స్థానిక మత్స్యకారులు ముందుకొచ్చినా... వారికి అవకాశం ఇవ్వకపోవడంతో బాధిత కుటుంబ సభ్యుల్లో తీవ్ర నిరాశ నెలకొంది.
ఇదీ చదవండీ... బోటు మునకకు ముందు పోలీసులు తీసిన ఫొటోలు ఇవే!