హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగుయువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. తెలంగాణ తెలుగుయువత అధ్యక్షుడు పొగాకు జయరాం చందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ హాజరయ్యారు.
తెలుగుయువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం - హైదరాబాద్ వార్తలు
గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా తెలంగాణ తెలుగుయువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. హైదరాబాద్ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో జరిగిన ఈ కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ పాల్గొన్నారు.
తెలుగుయువత ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం
ఎన్టీఆర్ స్ఫూర్తితో సేవ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. తలసేమియాతో బాధపడుతున్న వారికి రక్తం ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో యువకులు రక్తదానం చేశారు.