తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ: అంధ ప్రేమికులు... అంగరంగ వైభవంగా ఒక్కటయ్యారు - ananthapuram latest news

ఏపీలోని అనంతపురంలో అంధ ప్రేమికులను పెళ్లితో ఏకం చేసింది..స్థానిక స్వచ్ఛంద సంస్థ. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నవారు పెళ్లితో ఒక్కటవుదామనుకున్నారు. ఆర్థిక పరిస్థితి బాగా లేక పోవటంతో సంస్థను ఆశ్రయించగా... దాతల సహకారంతో కన్నుల పండువగా వివాహాన్ని జరిపించారు.

blind people married with the help of satasai at ananthapuram
అంధప్రేమికులు... అంగరంగ వైభవంగా ఒక్కటయ్యారు

By

Published : Jul 27, 2020, 7:26 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లాకు చెందిన ఇద్దరు అంధులను ఏకం చేసింది సాయి స్వచ్ఛంద సంస్థ. నగరానికి చెందిన సాయి కృష్ణ, లావణ్య పుట్టకతోనే అంధులు. మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు.

ఆర్థిక ఇబ్బందులతో ఉన్న ఇరువురి కుటుంబాలు సాయి స్వచ్ఛంద సంస్థను ఆశ్రయించగా... దాతల సహకారంతో వైభవంగా వివాహం చేశారు. నూతన దంపతులను జిల్లా అంధుల ఎంప్లాయిస్ అసోసియేషన్ అధ్యక్షుడు జలంధర్ రెడ్డి అశీర్వదించారు.

ఇవీ చూడండి-కరోనాకు మందు అంటూ మోసం..'కరోనా షట్ ఔట్-మేడిన్ జపాన్' పేరుతో విక్రయం

ABOUT THE AUTHOR

...view details