తెలంగాణ

telangana

ETV Bharat / state

'ఆందోళనకు యత్నించిన బీజేవైఎం నేతల అరెస్ట్' - ARREST

ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బీజేవైఎం నేతలు ధర్నాకు యత్నించగా...  పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం గాంధీనగర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు.

'ఆందోళనకు యత్నించిన బీజేవైఎం నేతల అరెస్ట్'

By

Published : Apr 28, 2019, 1:05 PM IST

ఇంటర్ బోర్డు నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ బీజేవైఎం చేపట్టిన ఆందోళన అరెస్టులకు దారితీసింది. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భరత్ గౌడ్ నాయకత్వంలో ధర్నా చేయడానికి కార్యకర్తలు ర్యాలీగా ఇందిరాపార్కు ధర్నాచౌక్​కు వచ్చారు. అప్పటికే భారీ బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసులు బీజేవైఎం కార్యకర్తలను అరెస్ట్ చేసి గాంధీనగర్‌ పీఎస్‌కు తరలించారు.

ప్రభుత్వం ఇంటర్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందని ఆరోపించారు. దీని ఫలితంగానే అనేకమంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని సూచించారు. ఒక్కో బాధిత కుటుంబాలని 25 లక్షల రూపాయల ఎక్స్​గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించని పక్షంలో ముఖ్యమంత్రి ఇల్లు ముట్టడిస్తామని స్పష్టం చేశారు.

'ఆందోళనకు యత్నించిన బీజేవైఎం నేతల అరెస్ట్'

ఇవీ చదవండి: 'రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకమైంది'

ABOUT THE AUTHOR

...view details