కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలపై విమర్శలు చేసిన కేసీఆర్... మాట మార్చుకొని కొత్త చట్టాలకు కితాబు ఇస్తున్నారంటూ భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ హర్షం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేసీఆర్ కళ్లు తెరిచారన్నారు. అయితే పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై.. ఆమె విమర్శలు గుప్పించారు. అన్నదాతలు కేంద్రం తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలకు మద్దతునిస్తున్నారన్న అక్కసుతోనే పంట కొనుగోలు కేంద్రాలను తొలగిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర రైతులకు భాజపా అండగా ఉంటుందని డీకే అరుణ అన్నారు.
కుట్రతోనే కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తున్నారు: డీకే అరుణ - భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ వార్తలు
రైతులు కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను ఆహ్వానిస్తున్నారని... అందుకే కేసీఆర్ పంట కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తామన్నారని డీకే అరుణ అన్నారు. రైతులకు భాజపా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
కుట్రతోనే కొనుగోలు కేంద్రాలను ఎత్తేస్తున్నారు: డీకే అరుణ