Bjp Focus on Elections: రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న భాజపా... ముందస్తు ఎన్నికల ప్రచారంతో అప్రమత్తమైంది. అధికార తెరాస కంటే ముందే అభ్యర్థులను ఎంపిక చేసి ప్రచార సంకేతాలు ఇవ్వాలని భావిస్తోంది. ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిపెట్టారు. 19 ఎస్సీ, 12 ఎస్టీ స్థానాల్లో విజయం సాధించాలనే లక్ష్యంతో... ఎస్సీ, ఎస్టీ నియోజకవర్గాల సమన్వయ కమిటీలకు ఛైర్మన్‌లు, సభ్యులను నియమించింది. ముందస్తుగా అభ్యర్థుల ప్రకటనకు చేసుకునేందుకు హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముఖ్య నేతలకు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.
జనగామలో సభ...
ఈ నెల చివరలో జనగామలో జరిగే బహిరంగ సభకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. వచ్చే నెలలో కేంద్రహోంమంత్రి అమిత్ షా రాష్ట్రంలో పర్యటించనున్నారు. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి రోజు బండి సంజయ్ చేపట్టనున్న రెండో విడత ప్రజాసంగ్రామ యాత్రను అమిత్ షా ప్రారంభించనున్నారు. పాదయాత్ర ప్రారంభం రోజు జరిగే బహిరంగ సభలో అమిత్ షా సమక్షంలో తెరాస, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు కమలం పార్టీలో చేరుతారని పార్టీవర్గాలు తెలిపాయి. అమిత్‌షా పర్యటనకు సంబంధించి ఈ నెల 22న 200మందితో సన్నాహాక సమావేశం నిర్వహించనున్నారు.
అసంతృప్త నేతలతో చర్చలు...