తెలంగాణ

telangana

ETV Bharat / state

పోడు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం: బండి సంజయ్ - jatothu tanu naik

తెలంగాణలో పోడు భూముల సమస్యలు పరిష్కరించే వరకు భాజపా అలుపెరగని పోరాటం చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జాటోతు టాను నాయక్​ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు.

bjp telangana state president bandi sanjay participated in jatoth tanu naik death anniversary
పోడు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం

By

Published : Mar 20, 2021, 12:29 PM IST

తెలంగాణ రైతాంగం కోసం ప్రాణాలొడ్డి పోరాడిన జాటోతు టాను నాయక్​ను స్ఫూర్తిగా తీసుకుని రాష్ట్రంలో పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జాటోతు టాను నాయక్​ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. టాను నాయక్​ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సంజయ్​తో పాటు భాజపా శ్రేణులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో పోడు రైతుల సమస్యలు పరిష్కారమయ్యే వరకు భాజపా పోరాటం ఆగదని సంజయ్ స్పష్టం చేశారు. నేటి తెరాస పాలన నాటి రజాకార్ల పాలనను తలపిస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలకు ఈ నియంత పాలన నుంచి త్వరలోనే ముక్తి లభిస్తుందని అన్నారు.

పోడు రైతులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం

ABOUT THE AUTHOR

...view details