BJP, Telangana Election Results 2023 Live : రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా కాషాయ పార్టీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యూహాలకు ప్రతి వ్యూహాలతో ఎన్నికల ప్రచారాన్ని (Telangana Election Results 2023) హోరెత్తించింది. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా, అధ్యక్షుడు జేపీ నడ్డా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన తర్వాత ప్రధాని ఏకంగా 5 సార్లు రాష్ట్రానికి వచ్చి 8 బహిరంగ సభలు, ఒక రోడ్ షోలో పాల్గొన్నారు.
BJP Top Leaders Loss Constituencies : 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అగ్ర నాయకత్వం సుడిగాలి పర్యటనలతో, ప్రచారాన్ని పెద్ద ఎత్తున నిర్వహించింది. అగ్రనేతల ప్రచారం బీజేపీ ఓట్ల శాతం పెరుగుదలకు దోహదం చేసింది. పాతబస్తీలోని బహుదూర్‌పురా, చార్మినార్, కార్వాన్, యాకత్పురా, మహేశ్వరం, సిర్పూర్, నిజామాబాద్ అర్బన్, గజ్వేల్, కరీంనగర్, ఆదిలాబాద్, నిర్మల్, గోషామహల్, ముధోల్, కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు హోరాహోరీగా పోటీనిస్తూ వచ్చింది. రౌండ్ రౌండ్‌కు ముందంజ, వెనకంజకు వెళ్తూ ఉత్కంఠను కలిగించింది.
భోపాల్ పీఠం మళ్లీ బీజేపీదే! కాంగ్రెస్‌పై స్పష్టమైన ఆధిక్యంలో కమలదళం
Telangana Assembly Results 2023 : ఈ క్రమంలోనే కామారెడ్డిలో ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, బీజేపీ అభ్యర్థి వెంకటరమణారెడ్డి విజయం సాధించారు. సీఎంపై ఆయన 5,810 ఓట్ల తేడాతో గెలుపొందారు. రెండో స్థానంలో కేసీఆర్, మూడో స్థానంలో రేవంత్ రెడ్డి నిలిచారు. అదే విధంగా నిర్మల్‌లో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డిపై, బీజేపీ అభ్యర్థి మహేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఆదిలాబాద్ నుంచి శంకర్, నిజామాబాద్ అర్బన్‌లో సూర్యనారాయణ, ఆర్మూర్‌లో రాకేశ్‌రెడ్డి, ముధోల్‌లో రామారావు పవార్, సిర్పూర్‌లో పాల్వాయి హరీశ్ గెలుపొందారు.
మరోవైపు కమలం పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలైన రాజాసింగ్, రఘునందన్ రావు, ఈటల రాజేందర్లలో.. రాజాసింగ్ గెలవగా, రఘునందన్ రావు, ఈటల రాజేందర్ పరాజయం పాల్యయారు. రెండు స్థానాల్లో పోటీ చేసిన ఈటల రాజేందర్ సొంత నియోజకవర్గమైన హుజూరాబాద్‌లో ఓటమి చెందారు. ముఖ్యమంత్రిపై గజ్వేల్‌లో పోటీ చేసి రెండో స్థానానికే పరిమితమయ్యారు. ఈటల రాజేందర్ ఓవర్ కాన్ఫిడెన్స్, ఒంటెద్దు పోకడలు దీనికి కారణాలుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి.