Bandi Sanjay on oldcity: పాతబస్తీని ఎంఐఎం కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాష్ట్ర సెక్రటరీ రషీద్ ఖాన్ చార్మినార్‌పై నమాజ్‌కు అనుమతించాలని చేపట్టిన సంతకాల సేకరణపై తీవ్రస్థాయిలో ఆయన స్పందించారు. భాగ్యలక్ష్మీ అమ్మవారిని దర్శించుకుంటేనే నమాజ్ గుర్తుకు వచ్చిందా అని నిలదీశారు. అంతకు ముందు నమాజ్ ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.
ముస్లిం మేధావి వర్గం ఆలోచించాలని మేం విజ్ఞప్తి చేస్తున్నాం. ఎంఐఎం పార్టీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగా చూస్తున్నది. ఓల్ట్ సిటీ న్యూ సిటీ ఎందుకైతలేదు. గోకుల్ చాట్, సాయిబాబా టెంపుల్, లుంబినీ పార్కులో బాంబులు పేల్చింది ఎవరు? దేశంలో ఏ సంఘటన జరిగినా ఓల్ట్ సిటీ పేరు ఎందుకు వస్తోంది. మేం భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి వెళ్తేనే నమాజ్ గుర్తుకొచ్చిందా? - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు