bandi sanjay on reddy rajagopal reddy : కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికతో నల్గొండ జిల్లాలో భాజపా బలోపేతం అవుతుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. తెరాసపై అవినీతిపై పోరాటం భాజపాతోనే సాధ్యమవుతుందని నమ్మి కలిసివచ్చేందుకు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో తెరాస కోవర్టు రాజకీయాలను ముందునుంచీ వ్యతిరేకించిన వ్యక్తి రాజగోపాల్‌రెడ్డి అని తెలిపారు.
తొందరలోనే రాజగోపాల్‌రెడ్డి భాజపాలో చేరుతారని సమచారం వచ్చింది. త్వరలోనే డేట్‌ను ప్రకటిస్తాం. ఆయన రాకతో భాజపా ఇంకా బలపడుతోంది. ప్రజల్లో ఇంకా నమ్మకం ఏర్పడుతోంది. - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
మరోవైపు రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పష్టం చేశారు. ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతం వల్లే ప్రజలు భాజపా వైపు చూస్తున్నారని తెలిపారు. మలివిడత పాదయాత్ర సన్నాహక సమావేశం పాదయాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ఆగస్టు 2నుంచి ప్రారంభంకానున్న పాదయాత్ర ఏర్పాట్లపై కమిటీ బాధ్యులతో బండి సంజయ్ చర్చించారు. రాష్ట్రంలో భాజపాకు అనుకూలమైన మార్పు వచ్చిందన్న సంజయ్ ... ప్రజా సంగ్రామ యాత్రను కాంగ్రెస్, తెరాస తక్కువ అంచనా వేశాయని తెలిపారు. యాదాద్రి నుంచి భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు మూడో విడత పాదయాత్ర సాగుతుందని తెలిపారు.
భాజపాలో కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేరికపై.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే! ఇదీ చూడండి: భాజపా నాయకులతో రాజగోపాల్‌రెడ్డి సంప్రదింపులు... అనివార్యం కానున్న ఉపఎన్నిక