తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటమి భయంతో తెరాస దాడులు: బండి సంజయ్ - Bandi sanjay comments

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే తెరాస దాడులకు దిగుతోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. పోలీసుల సమక్షంలోనే భాజపా నాయకులపై దాడి జరిగిందని వ్యాఖ్యానించారు.

ఓటమి భయంతో తెరాస దాడులు: బండి సంజయ్
ఓటమి భయంతో తెరాస దాడులు: బండి సంజయ్

By

Published : Mar 14, 2021, 4:54 PM IST

తెరాస ప్రలోభాలకు గురిచేసినా మేధావులు లొంగలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురులో భాజపా అభ్యర్థి ప్రేమేందర్ రెడ్డి, ఎస్టీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్ నాయక్​పై జరిగిన దాడిని అయన ఖండించారు. పోలీసుల సమక్షంలో భాజపా నాయకులపై దాడి జరిగిందని వ్యాఖ్యానించారు.

ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరగాలని తాము కోరుకున్నామని బండి సంజయ్ పేర్కొన్నారు. తెరాస ఓటుకు రూ. 10 వేలు పంచుతుంటే భాజపా కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారని... ఓటమి భయంతోనే తెరాస దాడులకు దిగుతోందన్నారు. ఎన్నికల సంఘం వెంటనే స్పందించి రెండు నియోజకవర్గాల్లో పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలని కోరారు. తమ వాళ్లు తిరగబడితే జరగబోయే పరిస్థితులకు తెరాసదే బాధ్యత అని అన్నారు.

ఇదీ చదవండి:తెలంగాణ భాజపాపై పవన్ కల్యాణ్ గుస్సా

ABOUT THE AUTHOR

...view details