ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు సికింద్రాబాద్ నియోజకవర్గంలో సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస్ నగర్లో వికలాంగులకు నిత్యావసర సరుకులు అందజేశారు భాజపా సీనియర్ నేత మేకల సారంగపాణి, యువనేత మేకల హర్ష కిరణ్. లాక్డౌన్ సమయంలో పేద ప్రజలెవరూ ఆకలితో అలమటించే వద్దనే ఉద్దేశంతో నిత్యావసర వస్తువులను అందజేస్తున్నట్లు భాజపా నాయకులు సారంగపాణి తెలిపారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత - నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
లాక్డౌన్ సమయంలో ప్రజలెవరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో భాజపా సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి నిరుపేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేశారు.
నిరుపేదలకు నిత్యావసర సరుకుల అందజేత
గత 60 రోజుల నుంచి సికింద్రాబాద్ నియోజకవర్గ పరిధిలోని పలు డివిజన్లలో నిరుపేద ప్రజలకు ఆహార పొట్లాలు, నిత్యావసర సరుకులు అందజేసినట్లు వివరించారు. ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటిస్తూ... మాస్కులు ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాజ్ కుమార్ నేత, ప్రతాప్, ఉపేందర్, రాజశేఖర్, రాకేష్, అరవింద్ రెడ్డి, శ్రీకాంత్, శ్రవణ్, భాజపా నాయకులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి:రాష్ట్రంలో కొనసాగుతున్న కొవిడ్ ఉద్ధృతి