తెలంగాణ

telangana

ETV Bharat / state

చక్రం తిప్పుతానని చెప్పి.. బొంగరం కూడా తిప్పలేదు: లక్ష్మణ్ - తెలంగాణ వార్తలు

ఆరేళ్లలో ప్రధాని మోదీ ఎన్నో సంస్కరణలు అమలు చేశారని భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ అన్నారు. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని చెప్పారు.

bjp obc morcha national president laxman speak about agriculture acts
చక్రం తిప్పుతానని చెప్పి.. బొంగరం కూడా తిప్పలేదు: లక్ష్మణ్

By

Published : Dec 17, 2020, 5:20 PM IST

దళారులకు కొమ్ము కాసే కొన్ని రాజకీయ శక్తులు వ్యవసాయ చట్టాలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని భాజపా ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. వ్యవసాయ చట్టాల విషయంలో రైతులను కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని వాపోయారు. వామపక్షాలు పీవీ నరసింహా రావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను కూడా తప్పుపట్టాయని... నాడు పీవీ అమలు చేసిన ఆర్థిక సంస్కరణల వల్లే దేశం ఈ స్థాయిలో ఉందని గుర్తు చేశారు. దేశానికి మేలు జరిగే అంశాలపై రగడ చేయడం వామపక్షాలకు అలవాటేనని లక్ష్మణ్ మండిపడ్డారు. ప్రైవేటు రంగం వల్ల వస్తువుల ధరలు తగ్గి, నాణ్యత పెరిగేందుకు అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.ప్రపంచంలోనే 5వ అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలిచిందన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మోదీ ప్రభుత్వం ఎంఎస్పీ పెంచిందని తెలిపారు.

చక్రం తిప్పుతానని చెప్పి.. బొంగరం కూడా తిప్పలేదు: లక్ష్మణ్

తెరాస వంటి ప్రాంతీయ పార్టీలు దేశ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. ఎనిమిదో నిజాంగా కేసీఆర్ ప్రఖ్యాతి గాంచారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఓయూ విద్యార్థిపై తెరాస నేతలు దాడికి పాల్పడ్డారు. ఈ దాడిని భాజపా తీవ్రంగా ఖండిస్తోంది. ఆరేళ్ల కేసీఆర్ పాలనలో ఉద్యోగుల పరిస్థితి అధ్వాన్నంగా మారింది. ఉద్యోగ సంఘాల నాయకులు ముఖ్యమంత్రికి ఊడిగం చేస్తున్నాయి.

సన్నవడ్లకు మద్దతు ధర అడిగితే ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు. భూసార పరీక్షలకు ఇచ్చిన నిధులను పక్కదారి పట్టించారు. కేసీఆర్ నిర్బంధ సాగు అంటే... మోదీ స్వేచ్ఛయుత సాగుకు చట్టం తెచ్చారు. పట్టభద్రుల, కార్పొరేషన్ ఎన్నికల్లో లబ్ధి కోసమే ఉద్యోగాల పేరుతో నాటకాలు ఆడుతున్నారు. తెలంగాణలో అంబేడ్కర్ రాజ్యాంగం పనిచేయదా.. కల్వకుంట్ల రాజ్యాంగమే పని చేస్తుందా.. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్... ఫ్యామిలీ ఫ్రంట్ అయింది.​ కేంద్రంలో చక్రం తిప్పుతానని చెప్పి కేసీఆర్.. కనీసం బొంగరం కూడా తిప్పలేదు.

లక్ష్మణ్, భాజపా ఓబీసీ మోర్ఛా జాతీయ అధ్యక్షుడు

ఇదీ చదవండి:ఎస్​ఈసీగా పార్థసారథి నియామకంపై హైకోర్టులో విచారణ

ABOUT THE AUTHOR

...view details