తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్‌లోనే భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు.. 2 రోజులు మోదీ, షా ఇక్కడే - హైదరాబాద్‌కు మోదీ అమిత్ షా

BJP National Working Committee Meetings: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ఈసారి హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. వచ్చే నెల 2, 3 తేదీల్లో రెండు రోజుల పాటు మేధోమధనం జరగనుంది. హైదరాబాద్‌లో ఏర్పాట్లను పరిశీలించిన భాజపా అగ్రనేతలు.. ఇక్కడే సమావేశాలు జరపాలని నిర్ణయించారు.

BJP National Working Committee Meetings in Hyderabad
BJP National Working Committee Meetings in Hyderabad

By

Published : Jun 1, 2022, 2:43 PM IST

Updated : Jun 1, 2022, 5:40 PM IST

BJP National Working Committee Meetings: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలకు హైదరాబాద్‌ వేదికగా మారనుంది. నగరంలోని హెచ్‌ఐసీసీలోని నోవాటెల్‌ హోటల్‌లో సమావేశాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లపై సమీక్షించేందుకు భాజపా జాతీయ కార్యనిర్వాహక కార్యదర్శి బీఎల్ సంతోష్‌ హైదరాబాద్‌ వచ్చారు.

Modi, Amit Shah Tour in Hyd: పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు ప్రధాని నరేంద్రమోదీ, కేంద్రహోంమంత్రి అమిత్‌షా, ఇతర కేంద్రమంత్రులు, జాతీయస్థాయి ముఖ్యనేతలు, భాజపా పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. రెండు రోజుల పాటు మోదీ, అమిత్‌షా తదితరులు ఇక్కడే ఉంటారు. ప్రధాని మోదీ రాజ్​భవన్​లో బస చేయనున్నారు. పార్టీ అగ్రనేతలతో పాటు సుమారు 300 మంది ప్రముఖులు ఉండేలా నోవాటెల్‌ హోటల్ వద్ద బస ఏర్పాట్లను చేస్తున్నారు. భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల నిర్వహణకు తెలంగాణను వ్యూహాత్మకంగానే ఎంపిక చేసినట్లు రాజకీయవర్గాలు భావిస్తున్నాయి.

ఇప్పటికే భాజపా నేతలు మాదాపూర్‌లోని హెచ్‌ఐసీసీని సందర్శించి పరిశీలించారు. ఈ సమావేశాల నిర్వహణ కోసం హైటెక్స్‌లోని హెచ్‌ఐసీసీతోపాటు మరికొన్ని హోటళ్లు, రిసార్ట్‌లను కూడా పరిశీలించారు. హైదరాబాద్‌లో ఈ సమావేశాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో బండి సంజయ్ 3వ విడత పాదయాత్ర వాయిదా పడినట్లే. ఈ నెల 23న సంజయ్ 3వ విడత పాదయాత్ర ప్రారంభం కావాల్సి ఉంది.

Last Updated : Jun 1, 2022, 5:40 PM IST

ABOUT THE AUTHOR

...view details