హైదరాబాద్ పాతబస్తీలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ పర్యటించారు. ఉప్పుగూడ, జంగమెట్ డివిజన్లలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. వరద ఎక్కణ్నుంచి, ఎలా వస్తుందని ఆరా తీశారు.
వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలి: డీకే అరుణ - dk aruna visited old city
వరద వచ్చినప్పుడు తాత్కాలిక పరిష్కారం చూపడం కాకుండా.. ముంపు ప్రాంతాల్లో వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ డిమాండ్ చేశారు. హైదరాబాద్ పాతబస్తీలో ముంపునకు గురైన ప్రాంతాల్లో పర్యటించారు.
భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
తెలంగాణ ప్రభుత్వం మజ్లిస్‌తో కుమ్మక్కై వివక్ష చూపుతోందని అరుణ ఆరోపించారు. పాతబస్తీలో మత ప్రాతిపదికన అభివృద్ధి జరుగుతోందని విమర్శించారు. యుద్ధ ప్రాతిపదికన రాజన్నబావి శివాజీనగర్ ప్రాంతాల్లో వరద నీరు ఇళ్లలోకి రాకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.