తెలంగాణ

telangana

ETV Bharat / state

అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: డీకే అరుణ - డీకే అరుణ వార్తలు

కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నట్లు.. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. ఉత్తమ్‌కుమార్ రెడ్డితోపాటు ఆయన అనుచరులు, సోషల్ మీడియా నిర్వాహకులపై ఆమె విమర్శలు గుప్పించారు.

bjp national vice president dk aruna campaing in ghmc elections
అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: డీకే అరుణ

By

Published : Nov 24, 2020, 5:18 AM IST

ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతోందని భాజపా జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. కాంగ్రెస్‌ పార్టీలోకి వెళ్తున్నట్లు.. ఉత్తమ్‌కుమార్ రెడ్డితో చర్చలు జరిపినట్లు సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారంపై మండిపడ్డారు. రానున్న రోజుల్లో విజయశాంతి కూడా భాజపాలో చేరుతుందని పేర్కొన్నారు.

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సైదాబాద్‌ డివిజన్‌లో రోడ్ షో నిర్వహించారు. సైదాబాద్ డివిజన్ భాజపా అభ్యర్థి కొత్త కాపు అరుణ రవీందర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గ్రేటర్​లో భాజపా గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు: డీకే అరుణ

ఇదీ చదవండి:గ్రేటర్​ పోరు: జీహెచ్ఎంసీ ప్రజలపై సీఎం వరాల జల్లు

ABOUT THE AUTHOR

...view details