బడ్జెట్లో నిరాశ తప్ప.. ఆశ కన్పించటం లేదని భాజపా ఎమ్మెల్సీ రాంచందర్ రావు అన్నారు. బడ్జెట్ అంకెల గారడీతో ప్రజలను ఆర్థిక మంత్రి హరీశ్‌రావు మాయ చేశారన్నారు. మూసీ నది ప్రక్షాళనకు.. హైదరాబాద్ అభివృద్ధికి నిధులు కేటాయించలేదని ఆందోళన వ్యక్తం చేశారు. బడ్జెట్‌తో ప్రభుత్వ ఉద్యోగులు, యవత, నిరుద్యోగులు తీవ్ర నిరాశ చెందారన్నారు.
'బడ్జెట్లో నిరాశ తప్ప... ఆశ లేదు' - state budget 2020
ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భాజపా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు విమర్శలు గుప్పించారు. బడ్జెట్ కేవలం అంకెల గారడీకి పరిమితమైందని ఆరోపించారు.
బడ్జెట్‌పై విమర్శలు
పీఆర్సీ ఆలస్యం అవుతుందని చెప్పినపుడు... ఐఆర్ అయినా ఇవ్వాలని డిమాండ్ చేశారు. రూ.50 వేల కోట్లతో హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ స్థాయి విశ్వనగరంగా మార్చేందుకు ఖర్చులు పెడుతామని చెప్పి నిధులు కేటాయించలేదన్నారు.
ఇదీ చూడండి:తెలంగాణ బడ్జెట్.. రూ.1,82,914 కోట్లు