ప్రజా సమస్యలను చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాలను 15 రోజులైనా నిర్వహించాలని... భాజపా ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, రాజాసింగ్ డిమాండ్ చేశారు. శాసనసభ ప్రారంభం సందర్భంగా... ట్యాంక్ బండ్‌పై ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అక్కడి నుంచి అసెంబ్లీ వరకు పాదయాత్ర నిర్వహించారు.
దళిత బంధును రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో అమలు చేయాలని రాజాసింగ్ డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్... దళితుడిని సీఎం చేస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు. మూడెకరాల భూమిపై కూడా మోసం చేశారన్నారు. మరోసారి దళిత బంధు పేరుతో... దళితులను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అసెంబ్లీ సమావేశాలను రెండు మూడు రోజులే కాకుండా.. ఒక పదిహేను రోజులైనా నిర్వహించాలి. తెలంగాణలో మాట్లాడుకోవాల్సిన అంశాలు ఉన్నాయి. దళిత బంధు మంచి స్కీమ్. ఇంత మంచి పథకాన్ని ఒక్క నియోజకవర్గానికే పరిమితం ఎందుకు చేశారు? కేవలం హుజూరాబాద్‌ను దృష్టిలో ఉంచుకునే ఈ పథకాన్ని తీసుకు వచ్చారా?