BJP MLA Tickets Issues in Telangana 2023 : అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసేందుకు ఆసక్తి చూపి సీటు దక్కకపోవడంతో (BJP MLA Tickets Issues in Telangana).. అసంతృప్తితో ఉన్న నేతలను బుజ్జగించే పనిలో భారతీయ జనతా పార్టీనిమగ్నమైంది. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీని వీడగా.. టికెట్ దక్కని నేతల తీరు పార్టీకి సంకట పరిస్థితిని తెచ్చిపెట్టడంతో బీజేపీ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇన్ని రోజులు అసంతృప్తులని పెద్దగా పట్టించుకోని కాషాయ పార్టీ.. క్రమంగా ఒక్కొక్కరిని బుజ్జగిస్తోంది. వారిని దారికి తెచ్చుకోకుంటే ఎన్నికల్లో తీవ్ర నష్టం తప్పదని రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
ఊపందుకున్న ఎన్నికల ప్రచారం ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో అభ్యర్థులు
జీహెచ్‌ఎంసీకి చెందిన పలువురు కార్పొరేటర్లతో సమావేశమైన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(BJP State President Kishan Reddy).. ఎమ్మెల్యే టికెట్ ఆశించి భంగపడిన వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొందరు మాటవిన్నా.. మరికొందరు గుర్రుగా ఉన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 మంది.. కమలం పార్టీ కార్పొరేటర్లు గెలిచి సత్తాచాటారు. గెలిచిన కార్పొరేటర్లలో చాలామంది శాసనసభ టికెట్ ఆశించారు. కొందరు కార్పొరేటర్లు దాదాపు రెండు నుంచి ఐదు స్థానాలకు దరఖాస్తు చేసుకున్నారు.
BJP Focus on Dissatisfied Leaders : వారిలో ఎవరికీ టికెట్ కేటాయించకపోవడంతో.. తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. కష్టపడిన తమకు కాకుండా వేరేవారికి టికెట్ కేటాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కార్యకలాపాలకు అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తుండటంతో.. ఇబ్బందులు తప్పవని భావించిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఆలస్యంగానైనా రంగంలోకి దిగింది. మహేశ్వరం, ఎల్బీనగర్ సహా జీహెచ్ఎంసీ పరిధిలోని కార్పొరేటర్లను కిషన్‌రెడ్డి బుజ్జగించినట్లు సమాచారం.
Telangana BJP MLA Tickets Disputes :సనత్‌నగర్ టికెట్ ఆశించిన ఆకుల విజయ.. ఏకంగా పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించింది. కానీ ఆ స్థానాన్ని మర్రి శశిధర్‌రెడ్డికి కేటాయించడంతో అసంతృప్తితో ఉంది. ఆమెకు మంచి బాధ్యతలు అప్పగిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. జిల్లాల్లోనూ అసమ్మతి నేతల పోరు తీవ్రంగానే ఉంది. ఆ సెగలు పార్టీ రాష్ట్ర కార్యాలయం వరకు తాకాయి. ఆత్మహత్యాయత్నం చేసుకునే వరకు వెళ్లిందంటే.. పరిస్థితి ఎలా మారిందో అర్థం చేసుకోవచ్చు.