తెలంగాణ

telangana

ETV Bharat / state

Rajasingh on ktr: 'స్పందించమంటే విమర్శిస్తారా? మీరు వసూల్ చేస్తున్న రూ.41 మినహాయించండి'

ధనిక రాష్ట్రంగా చెబుతున్న కేసీఆర్ సర్కారు.. పాతబస్తీలో చేసిన అభివృద్ధి మంత్రి కేటీఆర్ ద్విచక్ర వాహనంతో పర్యటించి తెలుసుకోవాలని రాజాసింగ్ సవాల్​ విసిరారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని కేసీఆర్‌, కేటీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు.

Rajasingh on ktr: 'వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు పాతబస్తీకి బైక్​పై రండి'
Rajasingh on ktr: 'వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు పాతబస్తీకి బైక్​పై రండి'

By

Published : Oct 23, 2021, 3:31 PM IST

Updated : Oct 23, 2021, 4:34 PM IST

కొద్దిపాటి వర్షానికే పాతబస్తీ మునిగిపోతుందని.. వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు తనతో కలిసి బైక్‌ మీద తిరగాలని కేటీఆర్‌ను ట్విట్టర్‌ వేదికగా ఆహ్వానిస్తే ఆరు రోజులు ఆలస్యంగా స్పందించారని గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఎద్దేవా చేశారు. ట్వీట్‌ చేసిన ప్రశ్నకు కేటీఆర్‌ సమాధానం చెప్పకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారంటూ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్‌ చేశారని మండిపడ్డారు.

తెలంగాణ ప్రజల మీద ప్రేమే ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న 41రూపాయలను మినహాయించాలని డిమాండ్‌ చేశారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని కేసీఆర్‌, కేటీఆర్‌ అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. నిజాంకాలంలో నిర్మించిన నాలాలే ఇప్పటికీ ఉన్నాయని వాటిని ఏ మాత్రం పునర్నిర్మించలేదన్నారు.

'దాదాపు ఆరు రోజుల క్రితం ట్విట్టర్​ వేదికగా కేటీఆర్​కు ఓ ట్వీట్​ పెట్టాను. విషయమేంటంటే కొద్ది వర్షం పడితే పాతబస్తీ మునిగిపోతుంది. నిజాంకాలంలో నిర్మించిన నాలాలే ఇప్పటికీ ఉన్నాయి. అసెంబ్లీ సాక్షిగా కేసీఆర్​, కేటీఆర్​ అబద్ధాలు మాట్లాడుతున్నారు. పాతబస్తీ అభివృద్ధికి నిధులు కేటాయిస్తున్నామని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడారు. అయితే కేటీఆర్​కు ట్విట్టర్​ వేదికగా ఒక రిక్వెస్ట్​ ఏం చేశానంటే.. కేటీఆర్​ గారు మీరు, నేను కలిసి పాతబస్తీలో బైక్​పై తిరిగితే వాస్తవ పరిస్థితి తెలుస్తుందని చెప్పాను. ఆయన దానికి సమాధానం ఇవ్వకుండా పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ ధరలు పెంచారంటూ కేంద్రాన్ని లక్ష్యంగా చేసుకుని ట్వీట్‌ చేశారు. కేంద్రం పెంచుతోందని మీరు అంటున్నరు. అందులో రాష్ట్రం వాటా ఏమి లేదా?. మీకు ప్రజల మీద అంత ప్రేమ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం వసూలు చేస్తోన్న 41రూపాయలను మినహాయించండి.' -రాజాసింగ్​, గోషామహల్​ ఎమ్మెల్యే

'వాస్తవ పరిస్థితి తెలుసుకునేందుకు పాతబస్తీకి బైక్​పై రండి'

ఇదీ చదవండి:ktr and raja singh tweets: కేటీఆర్‌, రాజాసింగ్‌ మధ్య ట్వీట్ వార్

Last Updated : Oct 23, 2021, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details