తెలంగాణ

telangana

ETV Bharat / state

బీఏసీ భేటీకి పిలువకపోవడం అవకాశవాద రాజకీయం: రఘునందన్‌ - bjp mla Raghunandan Rao speech

బీఏసీ భేటీకి భాజపాను ఆహ్వానించకపోవడంపై ఎమ్మెల్యే రఘునందన్​రావు మండిపడ్డారు. భాజపాను ఆహ్వానించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఇది అవకాశవాద రాజకీయమని ఆరోపించారు.

బీఏసీ భేటీకి పిలువకపోవడం అవకాశవాద రాజకీయం: రఘునందన్‌
బీఏసీ భేటీకి పిలువకపోవడం అవకాశవాద రాజకీయం: రఘునందన్‌

By

Published : Mar 15, 2021, 4:12 PM IST

Updated : Mar 15, 2021, 4:19 PM IST

బీఏసీ భేటీకి భాజపాను ఆహ్వానించలేదని ఎమ్మెల్యే రఘునందన్‌రావు పేర్కొన్నారు. భాజపాను ఆహ్వానించకపోవడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. స్పీకర్, సభావ్యవహారాల మంత్రి జవాబువ్వాలని డిమాండ్ చేశారు.

గతంలో ఒక్క ఎమ్మెల్యే ఉన్నా బీఏసీకి పిలిచారని... ఇప్పుడు సంఖ్య లేదని పిలవకపోవడం అవకాశవాద రాజకీయమని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదని వెల్లడించారు. రేపు స్పీకర్‌ను కలిసి నిరసన తెలియజేస్తామని స్పష్టం చేశారు. సభ్యుల హక్కులను స్పీకర్ కాపాడాలని కోరారు.

బీఏసీ భేటీకి పిలువకపోవడం అవకాశవాద రాజకీయం: రఘునందన్‌
Last Updated : Mar 15, 2021, 4:19 PM IST

ABOUT THE AUTHOR

...view details