తెలంగాణ

telangana

ETV Bharat / state

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు డిపాజిట్‌ దక్కదు: రఘునందన్​

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు డిపాజిట్​ దక్కే పరిస్థితి లేదని భాజపా ఎమ్మెల్యే రఘునందన్​ రావు అన్నారు. ఏడేళ్లలో తెరాస సర్కారు పేదలకు, నిరుద్యోగులకు చేసిందేమి లేదని ఆరోపించారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు డిపాజిట్‌ దక్కదు: రఘునందన్​
ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు డిపాజిట్‌ దక్కదు: రఘునందన్​

By

Published : Feb 21, 2021, 5:25 PM IST

ఏడేళ్లలో తెరాస ప్రభుత్వం పేదలకు, నిరుద్యోగులకు చేసిందేమి లేదని ఎమ్మెల్యే రఘనందన్‌ రావు విమర్శించారు. హైదరాబాద్‌ వనస్థలిపురంలో తెలంగాణ పారామెడికల్‌ నర్సింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌ సమ్మిట్‌కు హాజరయ్యారు. ఇందులో ఎమ్మెల్సీ రామచంద్రరావుతో పాటు సీనియర్‌ నాయకులు పేరాల శేఖర్‌ రావు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు డిపాజిట్‌ దక్కే పరిస్థితి లేదని రఘనందన్‌రావు అన్నారు. ఇప్పటికే ప్రజలు తెరాస ప్రభుత్వాన్ని విస్మరించారని... రానున్న రోజుల్లో భాజపాకు పట్టం కట్టడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గాంధీ, ఉస్మానియా ఇతర సర్కార్ దవాఖానాల్లో ఎన్నో ఇబ్బందుల మధ్య ఫ్రంట్ లైన్ వారియర్స్ సేవలు అందిస్తున్నారని... వారి గోడు పట్టించుకునే పరిస్థితిలో ముఖ్యమంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాసకు డిపాజిట్‌ దక్కదు: రఘునందన్​

ఇదీ చదవండి: వ్యవసాయ రంగానికి పెద్దపీట: నిరంజన్​ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details