రాముడి గుడికి నిధుల సేకరణంటే ఐస్‌క్రీం అమ్మి 5లక్షలు సంపాదించినట్టు కాదని మంత్రి కేటీఆర్ గుర్తించుకోవాలని భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు కోరారు. తెరాస నేతలను రెచ్చిపోమని కేటీఆరే ప్రోత్సహిస్తున్నారని ఆయన ఆరోపించారు. రామమందిరం కోసం అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా నిధులు ఇస్తున్నారని.. అయోధ్య రాముడి నిధి సేకరణపై భద్రాద్రి గుడి వద్ద చర్చకు కేటీఆర్ సిద్దమా అని సవాల్ విసిరారు. రామదండు కదిలితే రాష్ట్రం కిష్కిందకాండ అవుతుందని.. బాధ్యత వహించటానికి సిద్ధంగా ఉండాలని కోరారు.
'గుడికి నిధుల సేకరణంటే.. ఐస్‌క్రీం అమ్మినంత ఈజీ కాదు' - telangana varthalu
అయోధ్య రాముడి నిధి సేకరణపై చర్చకు మంత్రి కేటీఆర్ సిద్ధమా అంటూ భాజపా ఎమ్మెల్యే రఘునందన్‌రావు సవాల్ విసిరారు. రాముడి గుడికి నిధుల సేకరణంటే ఐస్‌క్రీం అమ్మి 5లక్షలు సంపాదించినట్టు కాదని మంత్రి కేటీఆర్ గుర్తించుకోవాలన్నారు.
గతంలో రాముడు కోసం రామదండు ఏమి చేసిందో ఇప్పుడు అదే జరుగుతోందని.. రామదండు కదిలితే ప్రగతి భవన్, ఫాంహౌస్ కాంపాండ్ కూలుతాయన్నారు. పరకాల, వరంగల్‌లో భాజపా నాయకుల ఇళ్లపై దాడులు జరుగుతుంటే పోలీసు అధికారులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. రాముడిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా రేపు అన్ని మండల కేంద్రాల్లో ఆందోళనలు చేయనున్నట్లు తెలిపారు. తెరాస నాయకులు క్షమాపణ చెప్పకుంటే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని రఘునందన్‌రావు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: 'ఎవరి మనసులైనా నొచ్చుకుని ఉంటే మన్నించండి'